(Source: ECI/ABP News/ABP Majha)
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Allcargo, Mazagon, Cochin Ship, Inox India
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 21 December 2023: ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం నాటి నష్టాలను గురువారం కూడా కొనసాగించవచ్చు. పెట్టుబడిదార్లు ప్రపంచవ్యాప్తంగా లాభాల బుకింగ్‌కు దిగడంతో గ్లోబల్ మార్కెట్లలో బలహీనత ఉంది, అదే ఇండియన్ మార్కెట్లలోనూ కంటిన్యూ కావచ్చు. గోవా, కేరళ, మహారాష్ట్రల్లో కొవిడ్ కొత్త వేరియంట్ JN.1ని గుర్తించారు. ఇది కూడా మన మార్కెట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఓవర్‌నైట్‌లో, డౌ జోన్స్, S&P 500 వరుసగా 1.27 శాతం, 1.47 శాతం క్షీణించగా, నాస్‌డాక్ కాంపోజిట్ 1.5 శాతం పడింది.
యూఎస్ మార్కెట్ల నష్టాలను ఆసియా మార్కెట్లు అందిపుచ్చుకున్నాయి. జపాన్‌కు నికాయ్ 1.4 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా 0.6 శాతం వరకు పడ్డాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 53 పాయింట్లు లేదా 0.25% రెడ్ కలర్‌లో 21,142 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఐనాక్స్ ఇండియా: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. దీని IPO ఇష్యూ ప్రైస్ ఒక్కో షేరుకు 660 రూపాయలు.
జీ ఎంటర్‌టైన్‌మెంట్: విలీన ఒప్పందం తుది గడువును పొడిగించడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరపడానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ అంగీకరించింది.
ఆల్‌కార్గో లాజిస్టిక్స్: గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్‌లో LCL వాల్యూమ్ స్వల్పంగా 0.35 శాతం తగ్గింది. ప్రపంచ వాణిజ్యంలో కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో, అంచనాలకు అనుగుణంగా డిమాండ్ తగ్గుతోంది.
అల్ట్రాటెక్ సిమెంట్: క్లీన్ మ్యాక్స్ టెర్రాలో 26 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది, దీనికి సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది.
మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం ఆరు నౌకలను సరఫరా చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1615 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఈ కంపెనీ గెలుచుకుంది.
కొచ్చిన్ షిప్‌యార్డ్: రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 488.25 కోట్ల విలువైన కాంట్రాక్టును ఈ కంపెనీ గెలుచుకుంది.
ఐసీఐసీఐ బ్యాంక్: సందీప్ బాత్రాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ RBI ఆమోదం తెలిపింది.
టిప్స్ ఇండస్ట్రీస్: కుమార్ తౌరానీ, రమేష్ తౌరానీ సహా ఈ కంపెనీ ప్రమోటర్లు కంపెనీలో 6.07 శాతం షేర్లను విక్రయించారు.
DLF: బలమైన ఆస్తి డిమాండ్ కారణంగా.. హరియాణాలోని గురుగావ్, పంచకులలో సుమారు రూ. 1,400 కోట్ల విలువైన సేల్స్ చేసింది.
ఫ్లెయిర్ రైటింగ్: ఈ కంపెనీ Q2 ఆదాయం Q1 కంటే 4.2 శాతం పెరిగి రూ.257 కోట్లకు చేరుకోగా, లాభం 3 శాతం పెరిగి రూ.33 కోట్లకు చేరుకుంది.
ఆస్ట్రాజెనెకా ఫార్మా: మన దేశంలో, 2024 జనవరిలో ఎన్‌హెర్టును ప్రారంభించనుంది. దీనిని, గుర్తించలేని లేదా మెటాస్టాటిక్ HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఉన్న రోగుల చికిత్సలో ఉపయోగిస్తారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్థిరంగా పసిడి వెలుగులు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి