అన్వేషించండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Sobha, Dabur, PFC, REC

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 05 January 2024: బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు ఫ్లాట్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వీక్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయి. కాబట్టి, వ్యక్తిగత స్టాక్స్‌ పెర్ఫార్మెన్స్‌ను బట్టి సూచీలు కదలొచ్చు. 2023 డిసెంబర్‌ నెలకు సంబంధించిన సర్వీసెస్‌ PMI డేటా ఈ రోజు రాడార్‌లో ఉంటుంది.

ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నీరసంగా ఉన్నాయి. నికాయ్‌ 0.4 శాతం లాభపడింది. హాంగ్ సెంగ్ 0.4 శాతం క్షీణించింది. కోస్పి, ASX 200 ఫ్లాట్‌గా ఉన్నాయి.

ఓవర్‌నైట్‌లో, USలో S&P 500 0.34 శాతం పడిపోయింది, డౌ జోన్స్‌ 0.03 శాతం లాభపడింది, నాస్‌డాక్ 0.56 శాతం నష్టపోయింది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 15 పాయింట్లు లేదా 0.07% గ్రీన్‌ కలర్‌లో 21,773 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC): FY24 కోసం మార్కెట్ రుణ ప్రణాళికను రూ. 80,000 కోట్ల నుంచి రూ. 1.05 లక్షల కోట్లకు పెంచింది.

REC: ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ, గుజరాత్ ప్రభుత్వంతో రూ.2,094 కోట్ల విలువైన MOU కుదుర్చుకుంది.

డాబర్ ఇండియా: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పట్టణ ప్రాంతాల కంటే తక్కువగా ఉండటం, ధరలు తగ్గకపోవడంతో డిసెంబర్ త్రైమాసికం (Q3FY24) ఏకీకృత ఆదాయంలో మిడ్‌ టు హై సింగిల్ డిజిట్ వృద్ధిని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది.

శోభ: Q3 FY24లో అత్యుత్తమ త్రైమాసిక విక్రయాలు రూ. 1,952 కోట్లను సాధించింది. ఆ త్రైమాసికంలో మొత్తం 3.84 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది.

J&K బ్యాంక్: జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ మొత్తం వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 11.80% పెరిగి రూ.2.19 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 9% YoY వృద్ధితో రూ.1.29 లక్షల కోట్లకు పెరిగాయి.

ఉత్కర్ష్ SFB: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, Q3 FY24లో, స్థూల రుణాల్లో 31% YoY వృద్ధితో రూ. 16,408 కోట్లను రిపోర్ట్‌ చేసింది.

RBL బ్యాంక్: Q3FY24లో, మొత్తం డిపాజిట్లను రూ.92,743 కోట్ల వద్ద 13% YoY గ్రోత్‌ను, స్థూల అడ్వాన్సులు రూ.81,870 కోట్ల వద్ద 20% YoY గ్రోత్‌ను నివేదించింది.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.4,000 కోట్ల సమీకరణకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరు ధర రూ.1,812గా నిర్ణయించారు, ప్రస్తుత మార్కెట్ ధర కంటే దాదాపు 12.5 శాతం డిస్కౌంట్‌ ఇది.

శ్రీ సిమెంట్: కంపెనీ కొత్త మాస్టర్ బ్రాండ్‌గా 'బంగూర్'ను ప్రకటించింది.

టోరెంట్ ఫార్మా: అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించేందుకు జనవరి 3, 2024 నుంచి కొలంబియాలో ఫార్మాసియుటికా టోరెంట్ కొలంబియా SAS పేరుతో పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ప్రారంభించింది.

బ్రైట్‌కామ్ గ్రూప్: జనవరి 2, 2024 నుంచి అమల్లోకి వచ్చేలా, కంపెనీ CIO & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ విజయ్ కంచర్ల రాజీనామా చేశారు.

కోఫోర్జ్: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీస్ అజయ్ కల్రా వ్యక్తిగత కారణాల వల్ల, ఇతర అవకాశాల కోసం CFO పదవిని వదులుకున్నారు.

L&T ఫైనాన్స్ హోల్డింగ్స్: కంపెనీ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.500 కోట్లు సేకరించింది. Q3FY24లో రిటైల్ లోన్ బుక్ 31% YoY వృద్ధితో రూ.74,750 కోట్లకు, రిటైల్ డిస్‌బర్స్‌మెంట్‌ 25% YoY పెరుగుదలతో రూ.14,500 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: బీమా ఏజెంట్లు ఇక మోసం చేయలేరు, పాలసీ అమ్మేందుకు వీడియో-ఆడియో రికార్డింగ్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget