By: ABP Desam | Updated at : 11 Jan 2022 06:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో కరోనా పరీక్షలు(ఫైల్ ఫొటో)
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 36,452 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1831 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 242 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,974 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 7195 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 11th January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 11, 2022
COVID Positives: 20,81,779
Discharged: 20,60,079
Deceased: 14,505
Active Cases: 7,195#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yikIjJ5H4L
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674కి చేరింది. గడిచిన 24 గంటల్లో 242 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 7195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,16,66,683 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
రోజురోజుకి పెరుగుతోన్న కరోనా కేసులు తాజాగా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. 69,959 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 2.29%గా ఉంది. రికవరీ రేటు 96.36%గా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. కొత్తగా 33,470 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది వైరస్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 69,53,514కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,647కు చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 31 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,247కు పెరిగింది. కొత్తగా నమోదైన 31 కేసుల్లో 28 పుణె నగరంలోనే వెలుగుచూశాయి.
Also Read: ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ ప్రారంభించిన సీఎం జగన్.. నేటి నుంచే దరఖాస్తులు, వెబ్‌సైట్ వివరాలు ఇవీ..
తమిళనాడు..
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య ఆదివారం కంటే మరో 1000 పెరిగింది. ఒక్కరోజులో 13,990 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 36,866కు చేరింది. చెన్నైలో కొత్తగా 6,190 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చెంగల్‌పట్టు (16,96), తిరువల్లూర్ (1,054)లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు.
దిల్లీ
దిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం పడకల సంఖ్య పెంచింది.
Also Read: ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్ టెర్రర్.. అమెరికాలో ఒక్కరోజులో 11 లక్షల కేసులు
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ