Covid 19 Cases Worldwide: ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్ టెర్రర్.. అమెరికాలో ఒక్కరోజులో 11 లక్షల కేసులు
ఒమిక్రాన్ ధాటికి అమెరికాలో ఒక్కరోజులో 11 లక్షల కేసులు నమోదయ్యాయి. ఐరోపా దేశాలు కూడా ఈ కొత్త వేరియంట్ ధాటికి విలవిలలాడుతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ధాటికి ప్రపంచం గడగడలాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో ఏకంగా 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరోవైపు ఫ్రాన్స్‌లో నిన్న ఒక్కరోజే 22 వేల మంది కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరారు. 2021 ఏప్రిల్ నుంచి ఇదే అత్యధికం.
అమెరికా..
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రోజువారి కేసుల్లో ప్రపంచం మొత్తంలో ఇదే అత్యధికం. అంతకుముందు జనవరి 3న అమెరికాలోనే ఒక్కరోజులో 10 లక్షల కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య కూడా ఆల్ టైమ్ హైగానే ఉంది. 1,35,500 మంది ఆసుపత్రిలో చేరారు. గత ఏడాది జనవరిలో అత్యధికంగా 1,32,051 మంది ఆసుపత్రిలో చేరారు.
దీంతో రోగులను చూసుకునేందుకు కరోనా బారిన పడ్డ వైద్యులు, నర్సులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేని వారు లేదా స్వల్ప లక్షణాలు ఉన్నవారు విధుల్లో పాల్గొంటున్నట్లు అసోసియేట్ ప్రెస్ వెల్లడించింది.
ఫ్రాన్స్..
ఫ్రాన్స్‌లో కరోనాతో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 767 నుంచి ఒకేసారి 22,749కి చేరింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వెరన్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అంత ఆందోళన లేకపోయినప్పటికీ వ్యాప్తి చాలా వేగంగా ఉందని.. దీని వల్లే ఆసుపత్రిలో చేరికలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
యూకే..
యూకేలో ఆసుపత్రులు సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతే కీలక చికిత్సలను ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలని యూకే ప్రభుత్వం ఆదేశించింది.
ఇటలీ..
ఇటలీలో వ్యాక్సిన్ వేసుకోనివారిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, స్కై లిఫ్ట్‌లు, లోకల్ లేదా లాంగ్ డిస్టెన్స్ రైళ్లలో ప్రయాణించేందుకు, బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు కచ్చితంగా వ్యాక్సినేషన్ రిపోర్ట్ లేదా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న సర్టిఫికెట్ చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది.
50 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. లేకుంటే 100 యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి