By: ABP Desam | Updated at : 11 Jan 2022 03:44 PM (IST)
Edited By: Murali Krishna
ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ కానున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు.
2020లో కరోనా సంక్షోభం మొదలైన సమయంలో సీఎంలతో ప్రధాని మోదీ పలు దఫాలు చర్చించారు. ఆ సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఈసారి జరగనున్న భేటీలో అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని చర్చ నడుస్తోంది. కానీ ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింతగా దిగజారే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కీలక భేటీ..
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖ, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కీలక నిర్ణయం..
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో
Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!