Adilabad Police rescues | రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి పోలీసు సాయం | ABP Desam
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి ఊపిరి పోసి ప్రాణాలు కాపాడిన ఎస్సై వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతన్ పల్లి గ్రామానికి చెందిన ఫారూఖ్ అనే యువకుడు బైకు పై ఆదిలాబాద్ నుండి దంతన్ పల్లికి వెళుతుండగా... తోషం గ్రామ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుండి వస్తున్న ఓ వాహనం సైడ్ తీసుకుంటూ యువకుడి బైకును ఢీకొనడంతో కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పుడే ఆ దారిలో వెళుతున్న ఎస్సై బీ సునీల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడు శ్వాస ఆడక ఇబ్బంది పడుతుండటం చూసి ఊపిరి అందించాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన వాహనంలో దగ్గరలోని గుడిహత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఈ వైరల్ అవటంతో ఎస్సైని అంతా ప్రశంసిస్తున్నారు.





















