Cricketer Suresh Raina Debut in Movies | సినిమాల్లోకి మాజీ క్రికెటర్
బ్యాటింగ్ తో అందర్నీ అలరించిన భారత క్రికెటర్ సురేశ్ రైనా రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త రోల్లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించిన రైనా ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు.
చిన్న తలాగా చెన్నై అభిమానులకు దెగ్గరిన రైనా ... తమిళ సినిమాతో యాక్టర్ గా పరిచయమవుతున్నారు. దాంతో CSK ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ లోగాన్... రైనాను సిల్వర్ స్త్రీన్‌పై పరిచయం చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో రైనా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సురేష్ రైనా పాత్ర ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అంతా ఇప్పటి నుండి ఎదురు చూపులు మొదలు పెట్టారు. కోలీవుడ్ నిర్మాణ సంస్థ DKS బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.
క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లు తమిళ చిత్రాలలో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు సురేష్ రైనా కూడా అదే బాటలో నడుస్తున్నారు.





















