News
News
X

ఇదేం పనయ్యా బాబు.. బ్రీత్ అనలైజర్ ఉన్నది ఊదడానికి.. ఇలా పోలీసుల దగ్గర నుంచి ఎత్తుకెళ్లడానికా?

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్ నిర్వహించే ట్రాఫిక్‌ పోలీసులకు మందుబాబులు షాక్ ఇస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు.  

FOLLOW US: 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులు.. చేసే పనులు మామూలు ఉండదు. పోలీసులకే పరీక్ష పెడతారు. అయితే ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. ఇవన్నీ.. మామూలే.. అయితే తాజాగా ఓ ఇద్దరు మందుబాబులు ఏం చేశారో తెలుసా.. బ్రీత్ అనలైజర్ మెషిన్ ని పోలీసుల చేతిలోనుంచి లాక్కొని పారిపోయారు.

కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. సరిగ్గా 11.45 సమయంలో మియాపూర్‌ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులను బైకుపై వచ్చారు. వారిని పోలీసులు ఆపారు. అందరిలాగానే.. టెస్ట్ కు సహకరిస్తారని.. అనుకున్నారు పోలీసులు.. కానీ జరిగింది వేరే. హోంగార్డు బ్రీత్ అనలైజర్ టెస్టు చేస్తుండగా.. ఓ  మందు బాబు నోటికి దగ్గరగా పెట్టిన బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కొని క్షణాల్లోనే మాయమయ్యాడు. పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆ మందు బాబు అస్సలు దొరకలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్‌ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో పడ్డారు.

చాలా సందర్భాల్లో ట్రాఫిక్‌ పోలీసులతో మందుబాబులు బతిమిలాడించుకుంటారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల సమయంలో ఊదమంటే ఊదకుండా సతాయిస్తుంటారు. బ్రీత్‌ ఎనలైజర్‌ను దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత కొందరు పైకి.. మరికొందరు కిందికి.. ఇంకొందరు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ గాల్లోకి ఊదుతారు. సరైన రీడింగ్‌ రాదు. 15 సెకన్లు క్రమంగా ఊదితేనే మెషీన్‌ రీడింగ్‌ తీసుకుంటుంది. లేదంటే పదే పదే బీఏసీ కౌంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక డ్రంక్‌ అండ్‌ డ్రైవర్‌కు బీఏసీ చేయాలంటే కనీసం 20 నిమిషాలు సమయం తీసుకుంటుండగా తనిఖీలు అర్ధరాత్రి వరకు సాగుతుంటాయి.

ఇంకొందరు మందుబాబులు వాహనాన్ని అడ్డుపెట్టి తనను పోలీసులు వేధిస్తున్నారని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తుంటారు.  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించాలంటే ట్రాఫిక్‌ పోలీసులకు ఇబ్బందే. అయితే మెుదటిసారిగా కొండాపూర్ లో మాత్రం.. ఎలాంటి హంగామా చేయకుండా.. ఇద్దరు వ్యక్తులు బ్రీత్ ఎనలైజర్ ఎత్తుకెళ్లడం చూసి పోలీసులు షాక్ అవుతున్నారు.

Also Read: Balapur Laddu Auction: వేలంపాటలో బాలాపూర్ గణేశుడి లడ్డుకు భలే డిమాండ్.. 1994లో రూ.450తో మెుదలై.. ఇప్పుడు ఎంతో తెలుసా? 

Also Read: Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..

Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?

Published at : 19 Sep 2021 02:09 PM (IST) Tags: Hyderabad kondapur breath analyser drunk and drive test in hyderabad

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా

Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా

Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్

Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే

TS VROs G.O 121 : వీఆర్వోల సర్దుబాటు జీవో 121 పై తెలంగాణ హైకోర్టు స్టే

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

టాప్ స్టోరీస్

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం