(Source: ECI/ABP News/ABP Majha)
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో 181 పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..
Short Service Commission (SSC) officers: ఇండియన్ నేవీ 181 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ ఉద్యోగాలను దీని ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
నిరుద్యోగులకు ఇండియన్ నేవీ గుడ్ న్యూస్ అందించింది. 181 షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నేవల్ ఓరియెంటేషన్ కోర్సు వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అర్హులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. అకడమిట్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్న ( సెప్టెంబర్ 18) ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 5తో ముగియనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గానూ సంస్థ అధికారిక వెబ్‌సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌లను పూర్తి చేయాలి. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సులు కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమిక్ (INA) ఎజిమాలాలో 2022 జూలై నుంచి ప్రారంభం అవుతాయి. అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు..
1. జనరల్ సర్వీస్ [GS(X)] / హైడ్రో కార్డ్ - 45 పోస్టులు
2. ఎలక్ట్రికల్ బ్రాంచ్ [జనరల్ సర్వీస్ (GS)] - 34
3. ఇంజనీరింగ్ బ్రాంచ్ [జనరల్ సర్వీస్ (GS)] - 27
4. లాజిస్టిక్స్ - 18
5. ఎడ్యుకేషన్ - 18
6. పైలట్ - 15
7. నేవల్ ఆర్కిటెక్ (NA)- 12
8. అబ్సర్వర్ - 8
9. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)- 4
విద్యార్హత వివరాలు..
పోస్టులను బట్టి విద్యార్హతలో మార్పులు ఉన్నాయి. దాదాపు అన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు అర్హులుగా ఉంది. జనరల్ సర్వీస్ [GS(X)] / హైడ్రో కార్డ్, అబ్సర్వర్, పైలట్ సహా పలు పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్ (బీఈ/ బీటెక్) పూర్తి చేసి ఉండాలి. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1997 జూలై 2 నుంచి 2003 జూలై 1 లోపు జన్మించి ఉండాలి. అయితే పోస్టుల ఆధారంగా వయోపరిమితి మారుతుంది. అభ్యర్థులు అప్లికేషన్ నింపే సమయంలో తమ మొబైల్ నంబర్ (Mobile number), ఈమెయిల్ ఐడీ వివరాలను సరిగా ఇవ్వాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ సహా మరిన్ని వివరాలు వీటి ద్వారానే తెలియజేస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హతల డాక్యుమెంట్లను స్కాన్ కాపీ (సాఫ్ట్ కాపీ) రూపంలో అప్‌లోడ్ చేయాలి. ఈ స్కాన్ కాపీ సరిగా లేకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు. కాబట్టి తగిన జాగ్రత్తలతో దరఖాస్తు చేసుకోవాలి.