Assam Rifles Recruitment 2021: టెన్త్ అర్హతతో 1230 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో 1230 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
నిరుద్యోగులకు అస్సాం రైఫిల్స్ (Assam Rifles ) గుడ్ న్యూస్ అందించింది. సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో అస్సాం రైఫిల్ టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 64, తెలంగాణలో 48 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 25తో ముగియనుంది. ఆసక్తి ఉన్న వారు అస్సాం రైఫిల్ అధికారిక వెబ్‌సైట్ assamrifles.gov.inను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీన రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు.
విద్యార్హత, వయోపరిమితి..
పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి వివరాలు మారుతున్నాయి. అదికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2003 ఆగస్టు 1 నుంచి 1998 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు.. ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి టెన్త్, ఇంటర్ (12వ తరగతి), ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
క్లర్క్ - 349, కుక్ (మేల్) - 339, మేల్ సఫాయి - 107, బార్బర్ (మేల్) - 68, ఎలక్ట్రీషియన్ (మేల్) - 43, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ (మేల్) - 42, వెహికిల్ మెకానిక్ (మేల్) - 35, ప్లంబర్ (మేల్) - 33, ఫార్మాసిస్ట్ - 32, ఎక్స్ రే అసిస్టెంట్ (మేల్) - 28, లైన్‌మెన్ ఫీల్డ్ (మేల్) - 28, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికిల్ (మేల్) - 24, బ్రిడ్జ్ అండ్ రోడ్ - 22, పర్సనల్ అసిస్టెంట్ - 19, అప్‌హోల్‌స్టర్ (మేల్) - 14, ఇన్‌స్ట్రుమెంట్ రిపేర్ లేదా మెకానిక్ (మేల్) - 12, సర్వేయర్ (మేల్) - 10, ఫీమేల్ సఫాయి - 9, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ - 9, మసల్చి (మేల్) - 4 , ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ (మేల్) - 3
Also Read: ITBP Recruitment 2021: ఐటీబీపీలో 553 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. ముఖ్యమైన తేదీలివే..