ITBP Recruitment 2021: ఐటీబీపీలో 553 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. ముఖ్యమైన తేదీలివే..
ఇండో టిటెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్లు , సూపర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, డెంటల్ పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుంది.
భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ).. 553 మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి (సెప్టెంబర్ 13) నుంచి ప్రారంభం కానుండగా.. గడువు అక్టోబర్ 27తో ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://recruitment.itbpolice.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు..
- మెడికల్ ఆఫీసర్లు (అసిస్టెంట్ కమాండెంట్) - 345
- స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్) - 201
- సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (సెకండ్ ఇన్ కమాండ్) - 05
- డెంటల్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్) - 02
విద్యార్హత వివరాలు..
పైన పేర్కొన్న నాలుగు విభాగాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే ఎంసీఐ/ ఎన్‌ఎంసీ/ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి గుర్తింపు సైతం పొందాలని తెలిపింది.
వయోపరిమితి..
2021 అక్టోబర్ 27 నాటికి అభ్యర్థుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు అందించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి.
వేతనం వివరాలు..
మెడికల్ ఆఫీసర్లు (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు ఎంపికైన వారికి నెల వేతనం రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుంది. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్) ఉద్యోగంలో నెలవారీగా రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు జీతం అందిస్తారు. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (సెకండ్ ఇన్ కమాండ్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు భారీ వేతనం చెల్లిస్తారు. ఇక డెంటల్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం ఉంటుంది.
Also Read: NHM AP Recruitment 2021: ఏపీలో 494 ఉద్యోగాలు.. రూ.1,10,000 వరకు జీతం.. ఈ నెల 15తో ముగియనున్న గడువు
Also Read: NHPC Recruitment 2021: ఎన్‌హెచ్‌పీసీలో 173 ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు వేతనం..