News
News
వీడియోలు ఆటలు
X

NHM AP Recruitment 2021: ఏపీలో 494 ఉద్యోగాలు.. రూ.1,10,000 వరకు జీతం.. ఈ నెల 15తో ముగియనున్న గడువు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, కడప, విజయనగరం జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాల్లో 494 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 494 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులను కాంట్రాక్టు/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, కడప, విజయనగరం జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాల్లో (డీఎంహెచ్‌వో) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్, జనరల్‌ ఫిజిషియన్‌, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సులు, సైకియాట్రిక్‌ నర్స్‌ సహా పలు పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కర్నూలు డీఎంహెచ్‌వోలో 62, అనంతపురంలో 60, నెల్లూరులో 57 పోస్టులు, విశాఖపట్నంలో 67 పోస్టులు, గుంటూరులో 86 పోస్టులు, కడప జిల్లాలో 43 పోస్టులు, విజయనగరంలో 36 మెడికల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ నెల 15తో ముగియనుంది. 

విద్యార్హత, వయోపరిమితి వివరాలు.. 
పోస్టులను అనుసరించి విద్యార్హతలు మారుతున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, బీపీటీ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎండీ విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పోస్టులను అనుసరించి నెల వారీ వేతనం రూ. 12,000 నుంచి రూ.1,10,000 వరకు ఉంటుంది.

గుంటూరు డీఎంహెచ్‌వోలో 86 పోస్టులు..
గుంటూరు డీఎంహెచ్‌వోలో మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ విధానంలో ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకి పంపాలి. మరిన్ని వివరాల కోసం https://guntur.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 
విభాగాల వారీగా ఖాళీలు: స్టాఫ్‌ నర్సులు–35, మెడికల్‌ ఆఫీసర్లు–27, సైకియాట్రిక్‌ నర్స్‌–05, సోషల్‌ వర్కర్‌–04, ఆడియో మెట్రీషియన్‌–03, ఫిజియోథెరపిస్ట్‌, శానిటరీ అటెండెంట్‌, సైకియాట్రిస్ట్స్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌ విభాగాల్లో 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజిషియన్‌, కార్డియాలజిస్ట్‌, కన్సల్టెంట్‌ క్వాలిటీ మానిటర్‌ విభాగాల్లో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. 

కర్నూలు డీఎంహెచ్‌వోలో 62 పోస్టులు..
కర్నూలు డీఎంహెచ్‌వోలో మొత్తం 62 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకి పంపాలి. మరిన్ని వివరాల కోసం https://kurnool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌– 28, స్టాఫ్‌ నర్స్‌లు– 22, సోషల్‌ వర్కర్‌– 02 పోస్టులను భర్తీ చేయనున్నారు. సైకియాట్రిస్ట్‌, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజిషియన్‌, కార్డియాలజిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌, శానిటరీ అటెండెంట్‌, ఆడియోమెట్రీషియన్‌ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున భర్తీ కానుంది. 

అనంతపురం డీఎంహెచ్‌వోలో 60 పోస్టులు
అనంతపురం డీఎంహెచ్‌వోలో 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం https://ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి.
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సులు–25, మెడికల్‌ ఆఫీసర్‌–19, ఆడియోమెట్రీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌, సోషల్‌వర్కర్‌, శానిటరీ అటెండెంట్‌ విభాగాల్లో 2 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజిషియన్‌, కార్డియాలజిస్ట్‌, సైకియాట్రిక్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌,  కన్సల్టెంట్‌ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది.  

నెల్లూరు డీఎంహెచ్‌వోలో 57 పోస్టులు..
నెల్లూరు డీఎంహెచ్‌వోలో 57 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం https://spsnellore.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–23, స్టాఫ్‌ నర్సు–17, ఫిజియోథెరపిస్ట్‌, సైకియాట్రిక్‌ నర్స్‌, ఆడియో మెట్రీషియన్‌, సోషల్‌ వర్కర్‌, కార్డియాలజిస్ట్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌, శానిటరీ అటెండెంట్‌ విభాగాల్లో 2 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. సైకియాట్రిస్ట్‌, ఫోర్సెనిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజిషియన్‌ విభాగాల్లో ఒక పోస్టు చొప్పున భర్తీ కానుంది. 

పశ్చిమ గోదావరి, డీఎంహెచ్‌వోలో 83 పోస్టులు..
పశ్చిమ గోదావరి డీఎంహెచ్‌వోలో 83 ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం https://westgodavari.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి. 

విశాఖపట్నం డీఎంహెచ్‌వోలో 67 పోస్టులు..
విశాఖపట్నం డీఎంహెచ్‌వోలో 67 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం http://visakhapatnam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

కడప డీఎంహెచ్‌వోలో 43 పోస్టులు..
కడప డీఎంహెచ్‌వోలో 43 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం https://www.kadapa.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

విజయనగరం డీఎంహెచ్‌వోలో 36 పోస్టులు..
విజయనగరం డీఎంహెచ్‌వోలో 36 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం  https://vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Also Read: APPSC: 28 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ

Also Read: TCS Jobs: మహిళలకు టీసీఎస్ బంపర్ ఆఫర్.. ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..

Published at : 12 Sep 2021 12:43 PM (IST) Tags: AP Jobs guntur nellore kurnool Kadapa West Godavari Vishaka patnam NHM AP Recruitment 2021 AP Medical Jobs NHM DHMO Vijaya Nagaram Anatapur

సంబంధిత కథనాలు

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్