TRS Party News: టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్.. కేసీఆర్ తరపున మంత్రుల నామినేషన్
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు.
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల అయింది. ఆ పార్టీ నేత, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం టీఆర్ఎస్ భవన్‌లో విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆదివారం (అక్టోబరు 17) నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీలో అధ్యక్షుడిని ఎన్నికుంటారని తెలిపారు.
Also Read: Hyderabad: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
ఇప్పటికే టీఆర్‌ఎస్ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయినట్లుగా ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా పూర్తయితే ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్లు
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్‌లో పలువురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమైన తేదీలు
* 22 వరకు నామినేషన్ల ప్రక్రియ
* 23 న స్క్రూటినీ ఉంటుంది
* 24 న నామినేషన్ల ఉపసంహరణ
* ఈ నెల 25 న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ
* ఇదే రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది
Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా..
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన రాష్ట్ర మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ మహమూద్ అలీ, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు...
— TRS Party (@trspartyonline) October 17, 2021
1/2 pic.twitter.com/Jihtqpzzzf