By: ABP Desam | Updated at : 17 Oct 2021 08:48 AM (IST)
Edited By: Venkateshk
కేటీఆర్, రాజా సింగ్ (ఫైల్ ఫోటోలు)
హైదరాబాద్‌లో శనివారం అకాల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. దీంతో ఎప్పటిలాగే విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హైదరాబాద్‌లో వరదలపై మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. ఈ మేరకు మంత్రికి ఎమ్మెల్యే సవాలు విసిరారు. తనతో పాటు తన బుల్లెట్టు బైక్‌పై రైడింగ్‌కు రావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. నగరంలో వర్షం పడుతున్న సమయంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితం అవుతోందని, వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. దీనికి సంబంధించి రాజా సింగ్ ఓ సెల్ఫీ వీడియో శనివారం విడుదల చేశారు.
Also Read: హజురాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి !
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రంగా ఉందని.. ప్రజలకు కాదని అన్నారు. ఏడేళ్లుగా మాటల్లోనే చెబుతున్నారని.. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని రాజా సింగ్ అన్నారు. వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్‌లో దారుణమైన పరిస్థితి నెలకొంటోందని గుర్తు చేశారు. తనతో పాటు వచ్చి గోషామహల్ నియోజకవర్గం నుంచి బైక్‌పై తిరగాలని అన్నారు. వాస్తవంగా కనీసం సైకిల్ వెళ్లేందుకు కూడా వీలు లేని విధంగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే వీడియోలో చెప్పారు.
Also Read: హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మంత్రికి తాను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నానని, వెంటనే తనతో పాటు పాత బస్తీలో పర్యటించేందుకు రావాలని, స్థానికుల సమస్యను తెలుసుకోవాలని కోరారు. ‘‘నిధుల గురించి, పాతబస్తీ అభివృద్ధి గురించి కేటీఆర్ అసెంబ్లీలో ఏవేవో మాటలు చెప్పారు. అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓసారి చూసి వద్దాం.. రండి. నా బుల్లెట్ బండిపై మొదట గోషామహల్ నియోజకవర్గంలో పర్యటిద్దాం. ఆ తర్వాత పాత బస్తీకి వెళ్లి పరిస్థితుల్ని చూసి వద్దాం’’ అని రాజా సింగ్ సవాలు విసిరారు.
కొద్ది రోజులుగా తెరిపించిన వానలు హైదరాబాద్‌లో శనివారం మళ్లీ ముంచెత్తిన సంగతి తెలిసిందే. చాలా సేపు కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ సమస్యతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై చాలా చోట్ల మోకాళ్లలోతు నీళ్లు నిలిచి వాహన రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఎదురైంది. ఫలితంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!
.@KTRTRS Ji let's take a ride on my bullet across #Goshamahal Constituency and old city you will have the 1st hand experience of the development that happened. What say? #HyderabadRains pic.twitter.com/AHPiQM4CxB
— Raja Singh (@TigerRajaSingh) October 16, 2021
Telangana Polling 2023 LIVE Updates: ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ - స్వల్ప ఘర్షణల మినహా పోలింగ్ ప్రశాంతం
Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!
Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!
KTR Comments: నా ఓటు వాళ్లకే వేశా - కేటీఆర్, అందరూ తరలిరావాలని పిలుపు
Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు
Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
/body>