(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao: ఈటల రాజేందర్‌కు హరీష్ రావు మరో సవాల్.. బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గులాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు!
Huzurabad By-Elections: బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గుళాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు గుళాంగిరీ.. ఏది కావాలో తేల్చుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.
Harish Rao: బీజేపీలో చేరిన తరువాత ఈటల రాజేందర్ అబద్దాలు బాగా నేర్చుకున్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తాను ఏ మీటింగ్ కు వెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవల శంకర్ నందన్ హాలులో మీటింగ్ పెట్టుకుంటే.. ఈటల మైక్ కట్ అయిందని.. అందుకు టీఆర్ఎస్ కారణమని గోబెల్స్ ప్రచారం చేశారు. కానీ ఫంక్షన్ హాలు వాళ్లు కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ కట్ చేశారని వెల్లడించారు. బీజేపీ గెలిస్తే ఢిల్లీకి గుళాంగిరీ.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు గుళాంగిరీ.. ఏది కావాలో తేల్చుకోవాలని హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.
రాత్రి పది గంటల సమయంలో టీఆర్ఎస్ వాళ్ల కారులో డబ్బులు, మద్యం తీసుకెళ్లారని.. డ్రైవర్ తాగి గుద్దారని నానా యాగీ చేశారు. చివరకు సీసీ కెమెరా చూస్తే.. పోలీసులు కారును పట్టుకుంటే విశ్వనాథ్ ఆనంద్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితడు, అతని కుమారుడు అని తేలినట్లు హరీష్ రావు తెలిపారు. ఇలా ఏవిధంగా చూసినా ఈటల అబద్దాలు చెబుతున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బులు లొంగే వ్యక్తులు కాదన్నారు. ఏడేళ్ల బీజేపీ పాలనకు, తెలంగాణలో ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండం పెడదామా అని ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు.
Also Read: హజురాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి !
గ్యాస్ సిలిండర్ పన్నుపై ఈటల సైలెంట్..
తెలంగాణ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ.291 రూ పన్ను వేస్తుందని దాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గ్యాస్ ధరలు బీజేపీ ప్రభుత్వ విధాన నిర్ణయమా కాదా, కేంద్రం గ్యాస్ ధరలు పెంచుతుందో లేదో సమాధానం చెప్పాలన్నారు. 2014లో సబ్సిడీతో గ్యాస్ ధర 464 రూపాయలు కాగా, నేడు సబ్సిడీ పోను రూ. 912 తో రెట్టింపయిందన్నారు. గ్యాస్ సిలిండర్‌పై పన్ను, ధరల పెంపు కేంద్రం నిర్ణయం కాదని నిరూపిస్తే హుజూరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరి రెండు రోజులు అయిందని హరీష్ రావు గుర్తుచేశారు.
Also Read: హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
శంభునిపల్లిలో మహిళలకు వడ్డీ లేని రుణం విషయంలో టీఆర్ఎస్ ఫేక్ చెక్కులు ఇచ్చిందని.. ఈ నెల 30 లోగా చెక్కులు క్లియర్ చేయాలని ఈటల దుష్ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. బతుకమ్మపండుగ ముందు అందరి అక్కౌంట్లలో పడ్డాయి. మహిళలు కూడా డబ్బులు వచ్చాయని చెప్పినట్లు స్పష్టం చేశారు. 25 కోట్ల 89 లక్షల రూపాయలు ఐదు మండలాల్లో ఇచ్చినట్లు తెలిపారు. ఆరుసార్లు ప్రజలు మిమ్ముల్ని గెలిపిస్తే, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. గ్రైండర్లు, గడియారాలు, కుట్టుమిష్లన్లు పంచింది ఎవరు, ప్రజలు తిరస్కరించి నేల మీద కొట్టారంటూ ఎద్దేవా చేశారు.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!