అన్వేషించండి

Huzurabad By Election: హుజూరాబాద్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిర్వహించవద్దని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిర్వహించవద్దని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబర్ 30వ తేదీ రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించరాదని తెలిపారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురించరాదని.. వాటిని ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. తమ ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా.. మీడియాలో ప్రసారం చేసినా శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. 

హుజురాబాద్‌కు స్టార్ క్యాంపెయినర్ల క్యూ..
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంపై దసరా ప్రభావం పడింది. పండుగ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలూ కాస్త జోరు తగ్గించాయి. ముఖ్య నేతలెవరూ ప్రచారంలో లేకపోగా.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. దసరా తర్వాత అన్ని ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించనున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సభలకు అనుమతి లేకపోవడంతో రోడ్ షోలు, గల్లీ ప్రచారాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

Also Read: హుజురాబాద్‌లో 61 మంది నామినేషన్లు ... ప్రధాన పార్టీల మధ్యే పోరు !

కేసీఆర్, కేటీఆర్ సైతం.. 
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. 20 మంది ముఖ్యమైన నేతల్లో 17 మంది ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ నేరుగా ప్రచారంలోకి దిగలేదు. వీరిద్దరూ కూడా హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈటలను ఓడించేందుకు హరీష్ రావు హుజురాబాద్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. పార్టీ నేతలకు చెందిన ఓ కాలేజీ కేంద్రంగా ఆయన రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 10 మంది ఓటర్లను ప్రభావితం చేస్తారనుకున్న ఏ వ్యక్తినీ వదలకుండా పార్టీలో చేర్చకుంటున్నారు. 

Also Read: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా 

కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు సైతం..
ఓటు బ్యాంక్‌ను కాపాడుకునే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పార్టీ తరఫున 20 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. 

బీజేపీ కూడా హుజురాబాద్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని గెలిపించుకోవడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తోంది. పార్టీకి చెందిన కీలక నేతలను ప్రచారంలోకి దించాలని నిర్ణయించింది. ఈటల ఓట్ బ్యాంక్ కాకుండా మెజారిటీపై దృష్టి పెట్టాలనే యోచనలో ఉంది. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. కేంద్ర స్థాయిలోని పలువురు ముఖ్య నేతలతో ప్రచారం చేయించాలని బీజేపీ యోచిస్తోంది. 

Also Read: దేవరగట్టులో నేడు కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం.. 

Also Read: ఆరెస్సెస్ ఆయుధ పూజ.. దేశ విభజనపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget