RSS Chief Mohan Bhagwat: ఆరెస్సెస్ ఆయుధ పూజ.. దేశ విభజనపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
విజయదశమి సందర్భంగా దేశ విభజన, సంప్రదాయాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుధ పూజ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ శస్త్ర పూజ (ఆయుధ పూజ) నిర్వహించారు. రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తలు ధనస్సు, బాణం శస్త్రాలుగా ఏర్పడి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విజయదశమి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన, సంప్రదాయాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Partition of the country is a sad history, the truth of this history should be faced, to bring back the lost integrity and unity, the new generation should know that history: RSS chief Mohan Bhagwat in Nagpur, Maharashtra #VijayaDashami2021 pic.twitter.com/LwuhpsLmHT
— ANI (@ANI) October 15, 2021
దేశ విభజన అనేది చీకటి అధ్యాయమని, చరిత్రలో విషాధకరమైన రోజులు అని మోహన్ భగవత్ అభవర్ణించారు. అయితే చరిత్రను మనం మార్చలేము. కానీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం అసాధ్యం కాదని.. అందుకు యువత పూపుకోవాలన్నారు. దేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కొత్త తరం ఎంతో శ్రమించాలని, దేశ చరిత్ర తెలుసుకోవడం వల్ల యువతలో నూతన ఆలోచనలు వస్తాయని ఆరెస్సెస్ చీఫ్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు నేటి ఉదయం సమాధి స్థల్ వద్ద ఆరెస్సెస్ వ్యవస్ధాపకుడు కేబీ హెగ్డేవార్ & ఎంఎస్ గోవాల్కర్‌కు నివాళులు అర్పించారు.
Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన
Our journey from 'Swadheehnta to Swatantrata' is as yet far from complete. There're elements in the world for whom India’s progress and its rise to a respected position are detrimental to their vested interests: RSS chief Mohan Bhagwat on the occasion of #VijayaDashami2021 pic.twitter.com/pMVNZVhuwB
— ANI (@ANI) October 15, 2021
నెరవేరని లక్ష్యాలు..
స్వాధీనత నుంచి స్వాతంత్య్రం సాధించుకున్నామని.. అయితే ఆ లక్ష్యాలు ఇప్పటికీ నెరవేరలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభిరుచులు, మార్గాలు ఒక్కటిగా ఉండి అంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలను వేరు చేసే సంప్రదాయం, సంస్క్కుతి మనకు అవసరం లేదన్నారు. కనీసం కొందరి జయంతి, వర్ధంతులు, పండుగలు అయినా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవాలన్నారు. అప్పుడే భారత ప్రజలంతా ఒక్కటేనని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా అవుతుందన్నారు.
Also Read: పండుగ నాడు భారీగా పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా