By: ABP Desam | Updated at : 15 Oct 2021 07:33 AM (IST)
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Telangana Rain Updates: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ – వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను మరో 24 గంటలల్లో చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం ప్రభావం ఏపీలోనూ ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో మరో ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు
Dated: 14.10.2021
Government of India
India Meteorological Department
Meteorological Center, Amaravati.
-----------------------------------------
Rainfall forecast for next 5 days valid from 08:30 IST of 14.10.2021 to 08:30 IST of 19.10.2021 for the districts Andhra Pradesh. pic.twitter.com/o4KjPXMN8J— MC Amaravati (@AmaravatiMc) October 14, 2021
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి..
తూర్పు మధ్య, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతం వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపారు. అల్ప పీడనం పశ్చిమ వాయవ్యవ దిశగా ప్రయాణించి .ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 14, 2021
కర్ణాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి నేడు బలహీనపడనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ దాదాపు పూర్తయినట్లుగా వాతావరణ కేంద్రం చెబుతోంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది జూన్ తొలి వారంలో ఏపీ, తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదిలాయి.
Also Read: Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..
రుతుపవనాల తిరోగమనం..
సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ తొలి వారం చివర్లో మొదలైన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ 12వ తేదీ నాటికి దాదాపు పూర్తయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల గత వారం వరుసగా మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
Mulugu District: ములుగులో ముక్కోణం- వచ్చే ఎన్నికల కోసం ప్రధాన పార్టీల వ్యూహరచన
ఇది అవమానమే .! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత
RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి