Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..
డీఎస్‌ను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం చర్చనీయాంశం కావడంతో దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను కలిశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న డీఎస్‌ను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం చర్చనీయాంశం కావడంతో దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. డి.శ్రీనివాస్‌ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని రేవంత్ చెప్పారు. ఆయన కొద్ది రోజుల క్రితం కిందపడ్డారని, దాంతో చెయ్యి విరిగిందని తెలిసి పలకరించేందుకు వెళ్లానని రేవంత్ రెడ్డి తెలిపారు. డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండబోవని రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read : కాలం మారింది.. తెలంగాణ ఏం చేస్తే రేపు భారత్ అదే చేస్తోంది: మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కింద పడడం వల్ల చేతికి దెబ్బ తగిలిందని, ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి నన్ను పలకరించటానికి ఇంటికి వచ్చారని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని అన్నారు. వయస్సులో తనకన్నా రేవంత్ రెడ్డి చిన్నవాడైనా, తాను కింద పడ్డానని తెలిసి వచ్చాడని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తనను పలకరించేందుకు తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
TPCC President, Revanth Reddy met Rajya Sabha MP, D Srinivas at his Residence and Enquired about his Health Condition.
— Team Congress (@TeamCongressINC) October 14, 2021
@revanth_anumula pic.twitter.com/4GGvpzHM5B
డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉండగా.. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. బీజేపీలోకి కూడా వెళ్తారనే ప్రచారం గతంలో సాగింది.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
వైఎస్ హయాంలో కీలక పదవులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా డి.శ్రీనివాస్ పనిచేశారు. 2004లో డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించారని భావించి 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నేతలు డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అప్పటి నుండి టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్