By: ABP Desam | Updated at : 14 Oct 2021 03:02 PM (IST)
Edited By: Venkateshk
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గులాబీ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నారు. అయితే, ఈ సమావేశం కోసం ఏర్పాట్లను పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్ల గురించి మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన సవ్యంగా సాగుతోందని, సరైన విధివిధానాలతో దేశంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సాధించుకున్న తెలంగాణలో అమలు పరుస్తున్న పథకాలను, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా స్ఫూర్తిగా తీసుకుంటోందని అన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ పథకాలను కేంద్రం ప్రారంభించిందని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని వెల్లడించారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేదని.. కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా కాలం మారిందని కేటీఆర్ అన్నారు.
‘‘వచ్చే 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు.. మొత్తం సమావేశం సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.’’ అని కేటీఆర్ అన్నారు. సభ నిర్వహణ, ఇతర ఏర్పాట్లను, కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీలోని వారినే కమిటీలుగా ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు.
Also Read: Hyderabad Crime: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!
ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్లు, పార్కింగ్, భోజనాలు, తీర్మానాలు, మీడియాతో పాటు ఇతర కమిటీలను నియమించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి వచ్చే వారికి పార్టీ తరపున ఐడీ కార్డులు ఇస్తామని, వారినే అనుమతిస్తామని తెలిపారు. పార్టీ ఆహ్వానించిన వారు తప్ప మిగతా వారు ఈ సమావేశానికి హాజరు కావొద్దని కోరారు.
Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
Also Read: Nirmal News: ప్రేమ కథా విచిత్రమ్...ఆయనకు 73, ఆమెకు 26... ఈ కథ సుఖాంతం..!
ఈ నెల 25న హైటెక్స్‌లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. pic.twitter.com/JGY4LL8fcj
— TRS Party (@trspartyonline) October 14, 2021
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Crime News: ఎలాంటి పరీక్షలు, ప్రాక్టికల్స్ లేకుండా 3 లక్షలకే బీటెక్ సర్టిఫికెట్
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Breaking News Live Updates : ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా హరీష్ కుమార్ గుప్తా బదిలీ
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర