Nirmal News: ప్రేమ కథా విచిత్రమ్...ఆయనకు 73, ఆమెకు 26... ఈ కథ సుఖాంతం..!
ఆ వధూవరులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారి కాంబినేషన్ చూసి నోరెళ్లబెట్టారు. ఈ వివాహం వెనుక ఓ ప్రేమకథ కూడా ఉంది. లేటు వయసులో ఘాటు ప్రేమ కథేంటంటే.
ఆయన వయసు 73, ఆమెకు 26.. ఇద్దరికి మధ్య 47 ఏళ్ల వ్యత్యాసం. వారి మధ్య ప్రేమ చిగురించి, ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇరువురి వివాహంపై కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరీ పెళ్లి తంతు చేశారు. తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్ గ్రామంలోని ఆలయంలో వివాహం జరిగింది. ఇద్దరికి ఇది రెండో వివాహంగా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింత కుంట తండాకు చెందిన రాథోడ్ కిషన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారంతా వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు.
రాథోడ్ కిషన్ భార్య అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. కుభీర్ మండలం రంజని తండాకు చెందిన సునీత భర్త ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. రంజనికి ఒక పాప, కూలి పని చేస్తూ పాపను పెంచుతుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్, సునీతకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారే దగ్గరుండి వివాహం జరిపించారు.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
భార్యకు ప్రేమతో
చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ పై ప్రేమతో తాజ్ మహాల్ కట్టించిన సంగతి తెలిసిందే. ఆ అద్భుతాన్ని చూసే అదృష్టం మాత్రం ముంతాజ్‌కు దక్కలేదు. ఉత్తర బోస్నియాలో నివసిస్తున్న ఓ మహిళకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఆమె సంతోషం కోసం భర్త కట్టిన సరికొత్త ఇంటిని చూసి మురిసిపోయింది. స్ప్రాక్‌కు చెందిన 72 ఏళ్ల వోజిన్ కుసిక్ తన భార్య లుబికాకు అరుదైన కానుక ఇవ్వాలని భావించాడు. గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించారు. పచ్చ రంగు గోడలు ఎర్రరంగు పైకప్పుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఇల్లు 22 సెకన్లలోనే ఒక రౌండ్ తిరుగుతుంది. ఇంటి నుంచి చూస్తే మొత్తం వ్యూ కనిపించాలని చెప్పిందని తెలిపారు. తన అభిరుచికి తగినట్లు ఆ ఇంటిని ప్లాన్ చేశానని చెప్పారు.
Also Read: నేటి నుంచి అమల్లోకి గెజిట్.... పాక్షికంగానే మొదటి దశలో అమలు...ఉత్తర్వుల జారీకి ప్రభుత్వాలు కసరత్తు
కుసిక్ తన సొంత ఆలోచనతో ఇంటిని నిర్మించారు. సాధాణంగా ఇలాంటి ఇళ్లను నిర్మించడం కేవలం ప్రొఫెషనల్‌కు మాత్రమే సాధ్యం. కానీ కుసిక్ తనకు ఎలాంటి అనుభవం లేకుండానే ఇంటిని అలా మార్చేసుకున్నారు. 75 ఏళ్ల వయస్సులో రోజులు తరబడి శ్రమిస్తూ తన భార్య కోరిన విధంగా ఇంటిని మార్చారు. ఇంకా కొన్ని పనులు ముగింపులో ఉన్నాయని, ప్రస్తుతం గుండ్రంగా తిరుగుతున్న తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. చిన్న స్విచ్ నొక్కితే చాలు ఇల్లు గిరగిరా తిరుగుతుందని కుసిక్ పేర్కొన్నారు.
Also Read: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి