Hyderabad Crime: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!
రాజేంద్రనగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
మహిళపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కఠినమైన చట్టాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలకు మృగాళ్లు వెనకాడడంలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆణె పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. అత్యాచారం అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
దిల్లీలో యువతిపై
దిల్లీలో ఓ యువతిని బాత్‌రూంలో బంధించి ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తుంది. అనంతరం యువతిని బెదిరించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తామని భయపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని బాధితురాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరోకరి గాలిస్తున్నారు.
Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
ఖమ్మంలో దారుణం
ఇద్దరు అన్నదమ్ములు కామంతో కళ్లు మూసుకుపోయి మరీ ప్రవర్తించారు. స్త్రీల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది పోయి ఆమె పరువు తీసే పనికి ఒడిగట్టారు. ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. చివరికి అవే బెదిరింపులతో లొంగదీసుకొని పలుసార్లు అత్యాచారానికి సైతం పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములపై ఆదివారం ఖమ్మం ఖానాపురం హవేలి స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరించి, వీరిద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్‌కు చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఇంటి పక్కన ఉండే ప్రవీణ్ రాజ్ అనే యువకుడు.. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి తన వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయని.. తాను చెప్పింది వినకుంటే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
Also Read: ఈ తాత టార్గెట్ యువతులే... రిటైర్డ్ అయ్యే వయసులో పాడు పనులు...
ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మహిళను లైంగికంగా లొంగదీసుకున్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో గతి లేని పరిస్థితుల్లో ఆమె వారు చెప్పిన దానికి తలవంచాల్సి వచ్చింది. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని తన సోదరుడు గిరిధర్‌కు చెప్పాడు. ఇదే అదునుగా అతని సోదరుడు గిరిధర్ కూడా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తుండడంతో వివాహిత గతి లేని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడుతూ కులం పేరుతో దూషించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఏసీపీ ఆంజనేయులు పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Also Read: మనీ లాండరింగ్ కేసులో నోరా ఫాతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సమన్లు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి