X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Anantapur News: ఈ తాత టార్గెట్ యువతులే... రిటైర్డ్ అయ్యే వయసులో పాడు పనులు...

రిటైర్డ్ అయ్యే వయసులో యువతులను వేధిస్తున్నాడో ప్రభుత్వ ఉద్యోగి. మహిళల ఆర్థిక అవసరాలు తీరుస్తానని చెప్పి వారిని లోబర్చుకుంటాడు. దిశ పోలీసులకు చిక్కిన ఈ కామాంధుడి కథలు చాలానే ఉన్నాయి

FOLLOW US: 

అతనో ప్రభుత్వ ఉద్యోగి.. వచ్చే నవంబర్ లో పదవీ విరమణ చేయబోతున్నాడు. చూడడానికి పెద్ద మనిషి లాగా ఉంటాడు. కానీ చేసేవన్నీ చిల్లర పనులు. యువతులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడు ఈ కామాంధుడు. మహిళలు, యువతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మాటామాటా కలపడం,  ఫోన్ నెంబర్లు తీసుకుని వారి బలహీనతలతో ఆడుకుంటున్నాడు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ఇలాంటి పాడు పనులు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్థిక అవసరాల తీరుస్తానని మహిళలకు వల

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు మాధవరెడ్డి. ఇతను ఈ ఏడాది నవంబర్ లో పదవీ విరమణ చేయబోతున్నాడు. అయితే  ఈ వయసుతో కూడా పాడు బుద్ధితో మహిళలు, యువతులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తానంటూ వారిని లొంగదీసుకోవడం ఇతని ప్రవృత్తి. దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళతో పరిచయం పెంచుకొని ఆమెను డ్రాప్ చేస్తానని స్కూటీలో ఎక్కించుకున్నాడు మాధవరెడ్డి. అనంతపురం పట్టణ శివారుకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ నిరాకరించే సరికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో మాధవరెడ్డి లీలలు బయటికి వచ్చాయి. 

Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి

యువతులే టార్గెట్ 

కాలేజీకి వచ్చే యువతులే ఈయన టార్గెట్. తాత లాంటి వాడు అని నమ్మి ఇతనితో సరదాగా మాట్లాడే యువతులను మాయమాటలు చెప్పి మోసగించడం, శారీరకంగా వాడుకోవడం,  అవసరం తీరాక బ్రోకర్ అవతారం ఎత్తి ఇతరుల వద్దకు పంపడం చేస్తున్న మాధవరెడ్డిని కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.  ఇతని చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే అటువంటి వారి వివరాలు తన దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కామాంధుడి పై గతంలో  వ్యభిచార కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  అలాగే విధినిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడినందుకు రెండు సార్లు సస్పెన్షన్ కు గురైనట్లు కూడా పోలీసు విచారణలో తెలిసిందని డీఎస్పీ వెల్లడించారు.

Also Read: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..

15 రోజుల రిమాండ్

ఈ ఏడాది నవంబర్  నెలలో రిటైర్మెంట్ కావాల్సిన వయసులో కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  ఒక యువతికి తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.  బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దిశ పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దిశ పోలీసులు.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా గతంలో ఉన్న కేసులు, ఇతని వ్యవహార శైలి వెలుగు చూసినట్లు డీఎస్పీ తెలిపారు. మాధవ్ రెడ్డికి కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Breaking News Crime News Anantapur news Anantapur latest news work inspector harassing women

సంబంధిత కథనాలు

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

East Godavari Crime: బైక్ సీటు కింద గంజాయి సీక్రెట్ గా రవాణా... కేటుగాళ్ల ఎత్తును చిత్తుచేసిన పోలీసులు

East Godavari Crime:  బైక్ సీటు కింద గంజాయి సీక్రెట్ గా రవాణా... కేటుగాళ్ల ఎత్తును చిత్తుచేసిన పోలీసులు

Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...

Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్

Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?