Chittoor News: చిత్తూరు జిల్లాలో దారుణం.. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు కిడ్నాప్, బొప్పాయి తోటలో శవమై!
Chittoor Boy Murder Case: నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన బాలుడి కథ విషాదాంతమైంది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభం శుభం తెలియని బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన బాలుడి కథ విషాదాంతమైంది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభం శుభం తెలియని బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాప్ అయిన బాలుడు బుధవారం నాడు బొప్పాయి తోటలో శవమై కనిపించాడు. దాంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం ఎగువ మేకలవారి పల్లిలో నాగిరెడ్డి, జ్యోతి దంపతులు ఉన్నారు. వీరికి సంతానంగా 8 ఏళ్ల కుమారుడు తేజసాయిరెడ్డి ఉన్నాడు. బాలుడ్ని ముద్దుగా తేజేష్ అని పిలుచుకునేవారు. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కువైట్‌కు వెళ్లారు. డబ్బులు సంపాదించి బాలుడికి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నారు. తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ చదువు కుంటున్నాడు.
Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
దసరా పండుగ అని...
పెద్దమ్మ ఇంట్లో పెరుగుతున్న తేజేష్ దసరా సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. పార్వతమ్మకు మనవడు తేజసాయిరెడ్డి అంటే ప్రాణం. అసలే తల్లిదండ్రులు కువైట్ లో ఉండటంతో బాలుడ్ని అల్లారుముద్దుగా చూసుకునేవారు. అయితే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలుడు మంగళవారం కిడ్నాప్ అయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించడకపోవడం అమ్మమ్మతో సహా బంధువులు కంగారుపడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎంత వెతికినా ప్రయోజనం కనిపించలేదు.
Also Read: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..
బొప్పాయి తోటలో శవమై..
మనవడు తేజేష్ గురించి ఏ వార్త వినాల్సి వస్తుందేమోనని అమ్మమ్మ పార్వతమ్మ, బంధువులు ఆందోళన చెందారు. వారి భయమే నిజమైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతుండగా బొప్పాయి తోటలో శవమై కనిపంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడ్ని కిడ్నాప్ చేసి.. ఆపై గొంతు నులిమి దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే సమీప బంధువులే తేజని హత్యచేసి ఉంటారని అమ్మమ్మ ఆరోపిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు !