Bypolls : హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు !
ఉపఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఫైనల్‌గా హుజురాబాద్‌లో 30 మంది , బద్వేలులో 15 మంది బరిలో ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేలు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఫైనల్‌గా 30 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తారని ప్రచారం జరిగినప్పటికీ వేయలేకపోయారు. వేసిన కొద్ది మంది నామినేషన్లు కొన్ని స్క్రూటినీలో పోయాయి. మరికొన్ని ఉపసంహరించుకున్నారు. చివరి రోజు మొత్తం పన్నెండు మంది ఉపసంహరించుకోవడంతో బరిలో నిలిచిన వారు 30 మందిగా తేలారు.
Also Read : రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! ‘మంచు’కు ముందుంది అసలు పరీక్ష !
ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్ బరిలో నిలిచారు. పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉండనుంది. ఇక చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్లు మరో 27 మంది బరిలో నిలిచారు. వీరిలో ఎక్కువ మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు వివిధ రకాలుగా సహకారం అందేందుకు నిలబడిన వారు ఉన్నారు. వారెవరూ సీరియస్‌గా ప్రచారం చేయరు. మరికొంత మందిని వ్యూహాత్మకంగా వివిధ పార్టీలు నిలబెట్టాయి. ఈ.రాజేందర్ పేరుతో నామినేషన్లు వేసిన వారు కూడా బరిలోనే ఉన్నారు. బరిలో 30మంది ఉండటంతో రెండు ఈవీఎం యూనిట్లను ఒక్కో పోలింగ్ బూత్‌లో వినియోగించనున్నారు.
Also Read : ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా .. ఇప్పటికిప్పుడు కొత్త సంఘం లేనట్లే !
ఇక ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది తుది జాబితాలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం 15 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్నికల్లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఉండదనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దివగంత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్ పోటీలో ఉన్నారు. బద్వేలులో టీడీపీ బరిలో లేకపోవడంతో కనీసం లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం !
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక రెండు వారాల పాటు ప్రచార గడువు ఉంటుంది. హుజురాబాద్‌లో ఇప్పటికే రెండు, మూడు నెలులుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. అక్కడ ప్రచార వేడి మరింత పెరగనుంది. బద్వేలులోమాత్రం పెద్దగా సందడి కనిపించడం లేదు. 30వ తేదీన రెండు చోట్ల పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల రెండోతేదీన కౌంటింగ్ జరుగుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి