KRMB Meet: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
![KRMB Meet: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం Hyderabad Krishna river management board meet ap demands hydro power projects under board Telangana opposed KRMB Meet: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/1bf752d80445107507482e3b698dd70c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం అయ్యింది. ఈ నెల 14 నుంచి గెజిట్ అమలులోకి రావడంపై బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. జల విద్యుత్‌ని బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కృష్ణ నదిపై ఉన్న విద్యుత్ పంప్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరుతోంది. విద్యుత్ పేరిట నీటిని శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు విడుదల చేస్తోందని ఏపీ ఆరోపణలు చేస్తోంది. ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బోర్డు కొత్త నిర్ణయాలు తీసుకోలేదని ఏపీ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి గెజిట్ అమలుపై జీవో ఇస్తామని ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామల్ రావు తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తి బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ కోరుతుంది. కానీ తెలంగాణ ఇందుకు అభ్యంతరం తెలుపుతోంది. ఈ నెల 14లోపు తన నిర్ణయాన్ని కేంద్రం, ఏపీకి తెలియజేస్తామని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Also Read: బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో అమిత్ షా కీలక భేటీ
ఈ నెల 14లోగా నిర్ణయం వెల్లడిస్తాం
కేఆర్‌ఎంబీ సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఇవాళ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి ఏపీ అనుమతి కోరుతోందని రజత్ కుమార్ అన్నారు. ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామన్నారు. తమ నిర్ణయాన్ని కేంద్రానికి, ఏపీకి త్వరగా చెబుతామన్నారు. ప్రాజెక్టులకు రుణాల గురించి సమావేశంలో చర్చకు రాలేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి అధికారం ఇవ్వాలని కోరామని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్వామలరావు అన్నారు. ప్రొటోకాల్ ప్రకారం అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదన్నారు. సాగర్, శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల గురించి బోర్డు ఛైర్మన్ చర్చించారనట్లు తెలిపారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని శ్యామలరావు అన్నారు
Also Read : దేశంలో విద్యుత్ సంక్షోభంపై పవర్ మినిస్టర్ ఏమన్నారంటే?
వాస్తవ కేటాయింపులు జరగాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణ జలాల్లో 811 టీఎంసీల వాటా వచ్చిందని రజత్ కుమార్ అన్నారు. 811 టీఎంసీలు పాత వాటా అన్న ఆయన... తెలంగాణ ఏర్పడిన తర్వాత వాస్తవ కేటాయింపులు జరగలేదన్నారు. ఇప్పటి వరకూ తాత్కాలిక అరెంజ్మెంట్ మాత్రమే జరిగిందన్నారు. 811 టీఎంసీల్లో తెలంగాణ 299 టీఎంసీలు కేటాయించారన్న రజత్ కుమార్ తెలిపారు. ఏపీ మిగతా 512 టీఎంసీలు వాడుకుంటుందన్నారు. 299 టీఎంసీలు+512 టీఎంసీలు వాటాలు ఇప్పటికీ కంటి న్యూ అవుతోంది.
Also Read: ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?
ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్ లెట్లను బోర్డు పరిధిలోకి వస్తాయని తెలిపింది. శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టుల డైరెక్ట్ అవుట్ లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది. గెజిట్ అమలు మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోడానికి అవకాశం ఉన్నట్లు కేఆర్ఎంబీ ఉపసంఘం తెలిపింది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు సమగ్రంగా ముసాయిదా తయారుచేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)