News
News
X

Delhi Power Crisis: దేశంలో విద్యుత్ సంక్షోభంపై పవర్ మినిస్టర్ ఏమన్నారంటే?

దేశంలో విద్యుత్ సంక్షోభం రానుందని వస్తోన్న వార్తలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ స్పందించారు.

FOLLOW US: 
 
దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతున్నట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. విద్యుత్‌ సంక్షోభంపై భయాందోళనలు అవసరం లేదని కొట్టిపారేసింది. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటి వార్తలు వస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం వెల్లడించారు. 

" విద్యుత్‌ సంక్షోభం రానున్నట్లు అనవసర భయాందోళనలు సృష్టించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గ్యాస్‌ సరఫరా కూడా తగ్గదు. విద్యుత్‌ అవసరమైన వారు కోరితే వారికి సరఫరా చేస్తాం.                   "
-ఆర్‌కే సింగ్‌, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

దేశంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని ఆయన తెలిపారు. విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన గ్యాస్‌ అందించాలని ఇప్పటికే గెయిల్‌ సీఎండీకి ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎన్‌టీపీపీ, బీఎస్‌ఈఎస్‌లతో పాటు విద్యుత్‌ మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆర్‌కే సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ వినియోగదారులకు సమాచారాన్ని పంపడం పట్ల కొన్ని సంస్థలను హెచ్చరించామన్నారు.

ప్రభుత్వ లెక్కలు ఇలా..

News Reels

కేంద్ర విద్యుత్ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో ఉన్న 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. వాటిలో 28 చోట్ల ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది, వెంటనే బొగ్గు సప్లై చేయలేకపోతే కరెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది. గత వారం చివరి నుంచి అనేక చోట్ల ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే పవర్‌‌ ప్లాంట్లు నడుపుకొస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పవర్ క్రైసిస్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు.

దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బొగ్గు కొరత గురించి పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాశారు. దిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీనిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు, గ్యాస్ సరఫరా అందిచాలని ప్రధాని మోదీని కోరారు.

Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Oct 2021 06:00 PM (IST) Tags: BJP CONGRESS Arvind Kejriwal Aam Aadmi Party Narendra Modi Prime Minister Delhi Chief Minister GAIL Discom Union Power Minister Power crisis R.K. Singh coal reserve Union Minister for Coal and Mines

సంబంధిత కథనాలు

ABP Desam Top 10, 9 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!