Hyderabad: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ యువతి చాటింగ్‌లో తాము తీసుకున్న నగ్న వీడియోలు రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతోందని ఓ బాధితుడు ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే స్నేహాలు, ప్రేమలు చాలావరకూ చివరికి ఎలాంటి స్థితికి దారి తీస్తున్నాయో అందరికీ తెలిసిందే. డబ్బులు గుంజడం, నకిలీ ప్రేమలు తరహాలో ఇతరత్రా విషాదాంతాలు ఎన్నో వెలుగు చూస్తుంటాయి. ఇలాంటి ఆన్ లైన్ ప్రేమల్లో నగ్న వీడియో కాల్స్ చేసుకుంటూ, న్యూడ్ ఫోటోలు పంపుకుంటూ చివరికి నాలుక కర్చుకుంటున్నవారు ఎంతో మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వాటితో డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఎంతో మంది యువతులు గతిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. తాజాగా దీనికి రివర్స్ పరిణామం చోటు చేసుకుంది. తన నగ్న వీడియోలతో ఓ యువతి బెదిరింపులకు పాల్పడుతోందని ఓ యువకుడు తప్పని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు.
Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి
ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ యువతి చాటింగ్‌లో తాము తీసుకున్న నగ్న వీడియోలు రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతోందని ఓ బాధితుడు ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్ నెం.12లోని భోళానగర్‌లో నివసించే ఓ 32 ఏళ్ల వ్యక్తి ఎల్రక్టీషియన్‌గా పని చేస్తున్నారు. జూలై నెలలో సాక్షి వర్మారెడ్డి అనే పేరుతో ఫేస్ బుక్‌లో ఓ యువతి పరిచయం అయింది. ఇద్దరూ స్నేహితులుగా మారి వాట్సాప్ ద్వారా కూడా చాటింగ్ కొనసాగించారు.
Also Read: ఈ తాత టార్గెట్ యువతులే... రిటైర్డ్ అయ్యే వయసులో పాడు పనులు...
వాట్సాప్ ద్వారా చేసే వీడియో కాల్స్‌లో ఆమె తన నగ్న వీడియోలు చూపించి.. బాధితుడిని కూడా బట్టలిప్పేయాలని కోరిందని బాధితుడు వాపోయాడు. దీంతో అతను అలాగే చేయడంతో యువతి వాటిని రికార్డు చేసింది. కాసేపటి తర్వాత ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెడతానంటూ యువతి బెదిరింపులకు పాల్పడిందని యువకుడు వాపోయాడు. ఆ వీడియోను కొంత మందికి కూడా పంపించినట్లుగా స్ర్కీన్ షాట్లు కూడా పంపిందని, అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Also Read: మనీ లాండరింగ్ కేసులో నోరా ఫాతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సమన్లు
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
Also Read: ఇక చార్మినార్ వద్ద కూడా సండే ఫన్ డే.. స్టాల్ పెడితే లాభాలు! ఇలా అప్లై చేసుకోవచ్చు.. HMDA ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి