ABP Desam Effect: ఏబీపీ దేశం కథనం చూసి చలించిపోయిన సివిల్ జడ్జి, పసిపాప ఫ్యామిలీకి తక్షణం అందిన సాయం
Telangana News | పుట్టిన రోజులకే తల్లి చనిపోవడంతో పసిపాప పాల కోసం కుటుంబం పడుతున్న కష్టాలను ఏబీపీ దేశం కథనం ప్రసారం చేసింది. స్పందించిన బోథ్ సివిల్ జడ్జి హుస్సేన్ ఆ కుటుంబానికి ఓ ఆవు, దూడ ఇచ్చారు.
ABP Desam Effect | ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని టేమ్రిగూడ గ్రామంలో నివాసముంటున్న దేశ్ ముఖ్ లస్మా - మారుబాయి దంపతులకు ఆగస్టు 20న ఓ పాప జన్మించింది. సెప్టెంబర్ 13వ తేదీన అనారోగ్యంతో పాపతల్లి మారుబాయి మృతి చెందింది. పసి పాపకు పాల కోసం పడుతున్న కష్టాలపై ఏబీపీ దేశం ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారి పాల కోసం దయనీయ పరిస్థితి అనే కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి మానవతావాదులు దాతలు స్పందించారు. సాయం కోసం వారి ఎదురుచూపులు ఫలించాయి. వారికి తోచిన సహాయాన్ని అందిస్తూ పాపకు అండగా నిలుస్తున్నారు.
బోథ్ సివిల్ కోర్టు జడ్జి (బోథ్ మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్) బి. హుస్సేన్ abp దేశం కథనానికి స్పందించి... పసిపాప ఆకలి తీర్చేందుకు పాలిచ్చే ఓ ఆవును వారికి అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని గోశాలలో ఆవును వారికి అందజేయగా వాహనంలో అవును వాహనంలో ఎక్కించుకొని టేమ్రిగూడ గ్రామానికి చేరుకొని లస్మా వారి కుటుంబ సభ్యులు ఆవును దాని చిన్న దూడను క్షేమంగా చూసుకుంటూ మేతవేస్తూ ఆ ఆవు పాలు తీసుకుంటున్నారు. ఈ ఆవుపాలతో పసిపాప ఆకలిని తీరుస్తున్నారు. తమ పాపకు కావలసిన పాలిచ్చే ఆవు రావడంతో అమ్మమ్మ కోడప లచ్చిబాయి వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు, మాజీ సర్పంచ్ టేకం రాజు హర్షం వ్యక్తం చేశారు.
ఏబీపీ దేశం కథనం ప్రసారం చేయడంతో బోథ్ జడ్జి హుస్సేన్ ఆధ్వర్యంలో తమకు ఒక ఆవును అందించాం. దీంతో వారు బోథ్ సివిల్ జడ్జి హుస్సేన్ కి, ఏబీపీ దేశం మీడియాకు పాప తండ్రి దేశ్ ముఖ్ లస్మా, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన అవును జాగ్రత్తగా చూసుకుంటూ పాపకు పాలు అందిస్తూ క్షేమంగా ఉండాలని జడ్జి హుస్సేన్ అన్నారు.