World Class Pet Animal Crematorium GHMC : పెంపుడు జంతువులకు ఇక గౌరవంగా అంతిమ సంస్కారాలు - హైదరాబాద్‌లో ప్రత్యేక శ్మశానవాటిక రెడీ !
పెంపుడు జంతువులు చనిపోతే వాటికి సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేటీఆర్ దీన్ని ప్రారంభించారు.
World Class Pet Animal Crematorium GHMC : పెంపుడు జంతువులంటే కుటుంబసభ్యులతో సమానం. కొన్నాళ్ల కిందట వరకూ ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలో కుక్కలతో పాటు ఇతర జంతువుల్నీ విరివిగా పెంచుకుంటున్నారు. ఉన్నంతకాలం వాటిని కుటుంబసభ్యులుగానే చూసుకుంటున్నారు. అయితే చనిపోయిన తర్వాత వాటిని ఎలా ఖననం చేయాలో మాత్రం వారికి తెలియడం లేదు. అందుకే ఊరికి దూరంగా తీసుకెళ్లి అలా విసిరేయడమో.. గుంత తీసి పాతిపెట్టి రావడమో చేస్తున్నారు. అలా చేయడం .. ఆ జంతువును ఇంత కాలం కంటికి రెప్పలా కాపాడుకున్న వారికి ఇబ్బందే. అయితే ఇక నుంచి హైదరాబాద్ వాసులకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. తమ పెంపుడు జంతువు ఏ కారణంతో చనిపోయినా.. సంప్రదాయబద్దంగా వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను అందుబాటులోకి తెచ్చారు.
Minister @KTRTRS inaugurated a world-class Pet Animal Crematorium at @GHMCOnline’s Animal Care Centre in Fathullaguda. The facility was set up to provide dignified & respectful last rites to pet animals in a scientific manner and in accordance with Pollution Control Board norms. pic.twitter.com/fNgcn7Hiay
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 6, 2022
[వరల్డ్ క్లాస్ పెట్ యానిమల్ క్రిమిటోరియాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడలోని యానిమల్ కేర్ సెంటర్ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. పీపుల్స్ ఫర్ యానిమల్ స్వచ్ఛంద సంస్థ వారు దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి యానిమల్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. జంతు కళేబరాల దహనం కోసం నూతన పరికరాలు ఏర్పాటు చేశారు. పెంపుడు జంతువులు చనిపోతే జంతు శ్మశాన వాటిక వారిని సంప్రదిస్తే నామ మాత్రపు ఛార్జీలతో వారు ఎంతో గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో జంతువుల కోసం నిర్మించిన మొదటి శ్మశాన వాటిక ఇదే.
తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకూ జంతువులకు ప్రత్యేకంగా శ్శశాన వాటిక లేదు. ఎంత ధనవంతులైనా ... పెట్స్ పై ఎంత ప్రేమ ఉన్నా.. చనిపోయిన తర్వాత వాటిని అలా అనాధల్లా ఎక్కడో ఓ చోట విసిరేసి రావడం కామన్‌గా జరిగిపోతోంది. ఈ అంశంపై వారిలోనూ అసంతృప్తి ఉంటుంది. చాలా మంది తమ సొంత స్థలాల్లో ఖననం చేసి.. జ్ఞాపకంగా నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ బాధ తప్పినట్లే. కన్ను మూసే వరకూ తమతో ఎంతో విశ్వసంగా ఉన్న జీవికి... గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించామన్న సంతృప్తి వారికి కలిగేలా.. ఫతుల్లా గూడ పెట్ క్రిమిటోరియం అందుబాటులోకి వచ్చింది.
వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకూ మెట్రో - మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనన్న కేటీఆర్!