X

Khammam: స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..

పుట్టింటికి వెళ్లిన భార్యను తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి కిడ్నాప్ చేశాడు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.

FOLLOW US: 

ఓ భర్త తన స్నేహితుల సాయంతో కట్టుకున్న భార్యనే బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పైగా వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత చిన్న చిన్న కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పుట్టింటికి వెళ్లిన భార్యను తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి కిడ్నాప్ చేశాడు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలివీ..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు యువతిని ప్రేమించాడు. పెళ్లి కోసం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన దామల్ల సుధాకర్‌ - రజిని దంపతులు వృత్తి రీత్యా చాలా కాలం నుంచి హనుమకొండలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు శాంతి హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతూ ఉంది. కరోనా సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన ఆమెకు భూపాలపల్లి జిల్లా స్తంభం పల్లికి చెందిన బాలరాజు అనే వ్యక్తితో పరిచయం అయింది. క్రమంగా ఆ ప్రేమ నుంచి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇలా పెద్దల అంగీకారంతోనే గత ఏప్రిల్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకున్నారు. 

Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?

కొన్ని నెలలకే ఈ నవ దంపతుల కాపురంలో గొడవలు అవ్వడం మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన శాంతి హన్మకొండలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన శాంతి చాలా రోజులైనా కాపురానికి రాకపోవడంతో పలుసార్లు బాలరాజు భార్యపై ఒత్తిడి తీసుకుని వచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అన్నడంతో బాలరాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా భార్యను కాపురానికి తీసుకొని వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

Also Read: Etala Akarsh : ఉద్యమకారులపై ఈటల ఆకర్ష్ .. బీజేపీలో వరుస చేరికలకు ప్లాన్ !

Also Read : ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..

ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్‌ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు తన స్నేహితులతో శాంతిని బలవంతంగా ఖమ్మం నుంచి తీసుకొని వెళ్లాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత మెట్టినింటి నుంచి తప్పించుకున్న శాంతి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై బాలరాజు తన అత్తామామలను ప్రశ్నించగా.. నర్సింగ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పెద్దలతో మాట్లాడి పంపిస్తామని తల్లిదండ్రులు బాలరాజుకు నచ్చజెప్పారు.

అయినా వినని అతను, బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న శాంతిని అడ్డగించాడు. స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చి.. అత్త రజిని, బావ మరిది సృజన్‌ను పక్కకు నెట్టేసి భార్యను కార్‌లో ఎక్కించుకొని వెళ్లిపోయాడు. దీంతో శాంతి తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Khammam Kidnap Case Mulugu Kidnap Case Husband Kidnap News Wife kidnap news Hanamkonda crime news

సంబంధిత కథనాలు

Breaking News Live: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో 2.7 కేజీల బంగారం సీజ్, విలువ రూ.1.36 కోట్లు

Breaking News Live: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో 2.7 కేజీల బంగారం సీజ్, విలువ రూ.1.36 కోట్లు

Vemulawada Muslim Marriages : కరోనా పెళ్లిళ్లలో జొమాటో విందులే కాదు.. "ఒక్క కర్రీ" భోజనాలు కూడా ఉంటాయ్ ! వేములవాడలో వీళ్లు తీసుకున్న నిర్ణయం ఇదీ..

Vemulawada Muslim Marriages :  కరోనా పెళ్లిళ్లలో జొమాటో విందులే కాదు..

Hussain Sagar Bridge: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన

Hussain Sagar Bridge: హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మాస్కో తరహాలో హుస్సేన్ సాగర్‌పై త్వరలోనే వేలాడే వంతెన

Telangana: ఆ మహిళలపై దాడుల్ని ఖండించిన మంత్రి సత్యవతి రాథోడ్, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

Telangana: ఆ మహిళలపై దాడుల్ని ఖండించిన మంత్రి సత్యవతి రాథోడ్, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !