TSRTC: ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..
రాష్ట్ర రవాణా శాఖపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
తెలంగాణ ఆర్టీసీ మరోసారి టికెట్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ చార్జీల పెంపునకు అన్ని రెడీ అయ్యాయి. దీనికి సంబంధించిన దస్త్రం తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే సీఎం కేసీఆర్ కార్యాలయానికి పంపింది. ఆయన ఆమోద ముద్ర వేయగానే పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ అతి త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా చార్జీల పెంపు ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్డీనరీ బస్సులో కిలో మీటర్‌కు 20 పైసలు, పల్లె వెలుగు బస్సుల్లో కిలో మీటరుకు 25 పైసలు, మిగతా ఇతర బస్సుల్లో 30 పైసల చొప్పున ఛార్జీలను పెంచాలని తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదిస్తూ దస్త్రాన్ని సీఎం ముందుంచారు.
మంత్రి సమీక్ష
రాష్ట్ర రవాణా శాఖపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనే చర్చిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్‌కు నివేదించామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన వివరించారు. లాంగ్ డిస్టెన్స్ రూట్లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వస్తాయని సీఎం సూచించారన్నారు. మొత్తం 1400 బస్సులు పూర్తిగా పాడయ్యాయని.. వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందని బాజి రెడ్డి వివరించారు.
అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ టీఎస్ ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడింది. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోంది. దీంతో ఛార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
Also Read: TRS Voters Camps : టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ .. క్యాంపులకు ఓటర్లు ! అసలేం జరుగుతోంది ?
Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...
Also Read: TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి