Shilpa Chowdary: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
శిల్పా చౌదరి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు డబ్బులు ఇచ్చిన ఒక్కొక్కరూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. తాజాగా మహేష్ బాబు సోదరి కూడా ఆమెకు డబ్బులు ఇచ్చినట్టు వెల్లడైంది.
శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ నెలాఖరున వీరిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లకు డబ్బులు ఇచ్చిన వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు ఎంత రావాలో చెప్పి ఫిర్యాదు చేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ట్ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని కూడా శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు వెల్లడైంది. తన దగ్గర రెండు కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని శిల్పా చౌదరి, కృష్ణ ప్రసాద్ దంపతులపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ప్రియదర్శిని ఫిర్యాదు చేశారు.
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
శిల్పా చౌదరి దంపతులు పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో నివాసం ఉంటున్నారు. తనను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకున్న శిల్పా చౌదరి... తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ, ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఏవని అడిగితే.. ఏళ్లు గడుస్తున్నా వాటి ఊసెత్తకుండా దాట వేస్తూ, బెదిరింపులకు సైతం దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ అందర్నీ నమ్మించింది. నిజమని భావించి పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి రూ.1.05 కోట్లు, మంచిరేవులకు చెందిన రోహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చారు. నెలల గడుస్తున్నా అసలు, వడ్డీ చేతికి రాకపోవటం, ఫోన్లకు స్పందించకపోవడంతో దివ్యా రెడ్డి ఈనెల 8న శిల్పాచౌదరి ఇంటికి వెళ్లారు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. శిల్ప బౌన్సర్లతో ఆమెను బెదిరించింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరి నిర్మాణ భాగస్వామిగా 'సెహరి' అనే రూపొందింది. త్వరలో ఆ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు!!
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం... చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ తర్వాత ఎవరు?
Also Read: 'సిరివెన్నెల'కు నివాళిగా... 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్' కూడా!
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన 'సిరివెన్నెల' కుటుంబం
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి