By: ABP Desam | Updated at : 01 Dec 2021 05:47 PM (IST)
'రాధే శ్యామ్'లో ప్రభాస్, పూజా హెగ్డే
'రాధే శ్యామ్' సినిమాలో రెండో పాటను ఈ రోజు (బుధవారం, డిసెంబర్ 1) విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, విడుదల చేయలేదు. దివంగత గేయ రచయిత 'సిరివెన్నెల'కు నివాళిగా, ఆయనపై గౌరవంతో సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని తెలియజేసింది. ఈ రోజు ఉదయం 'భీమ్లా నాయక్' సినిమా నుంచి 'అడివి తల్లి మాట...' పాటను కూడా విడుదల చేయాలని అన్నారు. 'సిరివెన్నెల' తిరిగి రాని లోకాలకు వెళ్లిన నేపథ్యంలో వాయిదా వేశారు. డిసెంబర్ 3న (గురువారం) అనుకున్న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని అనుకున్నారు. 'సిరివెన్నెల'కు నివాళిగా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్' బృందం కూడా నడిచింది.
We are deeply saddened by the passing away of the Legendary Lyricist Sirivennela Seetharamasastry Garu. As a mark of respect, we are postponing Nagumomu Thaarale, Thiraiyoadu Thoorigai, Naguvantha Thaareye & Malarodu Saayame to tomorrow at 11 AM. pic.twitter.com/bHt5L1OAFa
— UV Creations (@UV_Creations) December 1, 2021
'రాధే శ్యామ్' సినిమాలో రెండో పాట 'నగుమోము తారలే...'ను సిద్ శ్రీరామ్ పాడారు. తెలుగు సహా మిగతా దక్షిణాది భాషలు తమిళ్, మలయాళం, కన్నడలో గురువారం విడుదల చేయనున్నారు. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే... 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ సాంగ్ 'ఆషికీ ఆ గయీ'ను మాత్రం ఈ రోజు ఉదయం విడుదల చేశారు. దానికి మిథూన్ సంగీతం, సాహిత్యం అందించారు. అర్జిత్ సింగ్‌తో కలిసి ఆయనే పాట పాడారు. ఈ పాట మీద ఆల్రెడీ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సాంగ్ మధ్యలో కొన్ని షాట్స్‌లో పూజా హెగ్డే బదులు ప్రభాస్ వెనుక బండి మీద వేరే అమ్మాయి కూర్చున్నారని ట్రోల్ చేస్తున్నారు.
Also Read: వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన 'సిరివెన్నెల' కుటుంబం
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Liger: జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీ - విజయ్ దేవరకొండ స్పెషల్ మెసేజ్
Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి
Akshay Kumar: రామ్ చరణ్ ను 'అన్నా' అని పిలిచిన అక్షయ్ - ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ
Rocketry: ‘రాకెట్రీ’ సాంగ్స్, గుండె బరువెక్కించే సాహిత్యం, కన్నీరు ఆపడం అసాధ్యం!
Gopichand: రాని విషయాన్ని కెలకడం ఎందుకు? - డైరెక్షన్ పై గోపీచంద్ రియాక్షన్
Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!
Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్ రెడీనా? రాహుల్ ద్రవిడ్ కామెంట్స్!!
Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !
Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 ధర లీక్ - యాపిల్‌కు పోటీనిచ్చే ధరే!