News
News
X

WhatsApp Privacy Update: వాట్సాప్ యూజర్లకు ఫేస్‌బుక్ సీఈవో గుడ్ న్యూస్.. ఛాటింగ్ డేటా విషయంలో సరికొత్త సౌకర్యం

వాట్సాప్ యూజర్లు ఛాటింగ్ వివరాలను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లలో బ్యాకప్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది. గతంలో కేవలం యూజర్ల ఛాటింగ్ వివరాలను మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసేవారు.

FOLLOW US: 
 
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డేటా ప్రైవసీ విషయంలో ఇదివరకే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ సంస్థ కొన్ని నెలల కిందట ప్రైవసీ పాలసీ వివాదాన్ని సైతం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్ల డేటా భద్రత కోసం మరో కొత్త లేయర్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. చాటింగ్ డేటా బ్యాకప్ అప్‌డేట్ సెక్యూరిటీ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

వాట్సాప్ యూజర్లు ఛాటింగ్ వివరాలను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లలో బ్యాకప్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. గతంలో కేవలం యూజర్ల వాట్సాప్ ఛాటింగ్ వివరాలను మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసేవారు. అయితే యూజర్లు తమ ఛాటింగ్ డేటా కోసం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజాగా ఛాటింగ్ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో బ్యాకప్ చేసుకునే అవకాశాల్ని అటు ఆండ్రాయిడ్ వినియోగదారులకు, ఇటు ఐఫోన్ యూజర్లకు అందించనుంది. 

Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. ధ‌ర రూ.14 వేల‌లోపే.. రియ‌ల్ మీ సూప‌ర్ ట్యాబ్లెట్!

News Reels

మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో మెస్సేజ్‌లు, ఛాటింగ్ డేటాను బ్యాకప్ చేస్తున్న తొలి సంస్థ వాట్సాప్ అని జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇది చాలా కష్టతరమైన అంశమని, కొత్త ఫ్రేమ్‌వర్క్ విధానంలో పలు ఆపరేటింగ్ సిస్టమ్స్ సహాయంతో దీన్ని తమ టెక్నీషియన్లు సాధ్యం చేశారని తెలిపారు. యూజర్లు తమ డేటా ప్రైవసీ విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కొత్త ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చామనే దానిపై శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. సందేహాలు ఉంటే అందులో చెక్ చేసుకోవాలని ఫేస్‌బుక్ సీఈవో సూచించారు.

Also Read: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ.. 

బ్యాకప్ డేటా సేఫ్..
బ్యాకప్ చేసుకున్న ఛాటింగ్ డేటాను కేవలం ఆ యూజర్ మాత్రమే చూడగలడని సంస్థ చెబుతోంది. వాట్సాప్ సంస్థ సైతం యూజర్ల డేటా జోలికి వెళ్లడం కుదరదని పేర్కొన్నారు. 200 కోట్ల యూజర్లు రోజువారీగా పంపుకునే 100 కోట్ల మెస్సేజ్‌లకు ప్రైవసీ కల్పించడంలో భాగంగా ఫేస్ బుక్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. త్వరలో ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. యూజర్లు పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలని అప్పుడు ఛాటింగ్ డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుందని సంస్థ ప్రకటించింది.

Published at : 10 Sep 2021 09:20 PM (IST) Tags: WhatsApp WhatsApp Privacy Mark Zuckerberg WhatsApp Privacy Update

సంబంధిత కథనాలు

Samsung Galaxy M04: రూ.తొమ్మిది వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - రియల్‌మీ, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌తో పోటీ!

Samsung Galaxy M04: రూ.తొమ్మిది వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - రియల్‌మీ, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌తో పోటీ!

Xiaomi 13: ఆండ్రాయిడ్ ఫోన్లలోనే టాప్ ప్రాసెసర్‌తో షావోమీ కొత్త ఫోన్ - ఆ వివో ఫోన్ మాత్రమే పోటీ!

Xiaomi 13: ఆండ్రాయిడ్ ఫోన్లలోనే టాప్ ప్రాసెసర్‌తో షావోమీ కొత్త ఫోన్ - ఆ వివో ఫోన్ మాత్రమే పోటీ!

Infinix Hot 20 5G: ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 సేల్ ప్రారంభం - రూ.12 వేలలోపే 5జీ ఫోన్ - శాంసంగ్, వివోలతో పోటీ!

Infinix Hot 20 5G: ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 సేల్ ప్రారంభం - రూ.12 వేలలోపే 5జీ ఫోన్ - శాంసంగ్, వివోలతో పోటీ!

Jio Phone 5G: జియో ఫోన్ 5జీ ధర లీక్ - రూ.8 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Jio Phone 5G: జియో ఫోన్ 5జీ ధర లీక్ - రూ.8 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు