OnePlus: వన్‌ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..
దిగ్గజ స్మార్ట్ ఫోర్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ వచ్చే ఏడాది ఇండియాలోకి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.20 వేల లోపు ధరలోనే వీటిని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్, ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ పెట్టిన వన్‌ప్లస్ బ్రాండ్ త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వన్‌ప్లస్ నుంచి రూ.20000 ధరలో స్మార్ట్ ఫోన్లు రానున్నట్లు సమాచారం. 2022 క్యూ2లో ఈ ఫోన్లు ఇండియాలో లాంచ్ కానున్నట్లు లీకులు వెల్లడించాయి. వన్‌ప్లస్ నుంచి రూ. 30 వేల రేంజ్‌లో అనేక ప్రీమియం స్మార్ట్ఫోన్లు విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో నార్డ్ ఫోన్లు ముందంజలో ఉన్నాయి.
భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు క్రేజ్ మామూలుగా ఉండదనే విషయం తెలిసిందే. అందుకే రియల్‌మీ, షియోమీ (పోకో, రెడ్‌మీ), శాంసంగ్, వివో, ఒప్పో వంటి కంపెనీలు తక్కువ ధర ఫోన్లను విడుదల చేస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్రాండ్ల లిస్టులో వన్ ప్లస్ కూడా చేరనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ల విభాగంలోకి వన్‌ప్లస్ కూడా రానుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. వన్‌ప్లస్ ఒప్పోలో విలీనమైన తర్వాత కొన్ని నిబంధనలను నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల వన్‌ప్లస్ సైతం తన ఆక్సిజన్ ఓఎస్‌ని.. ఒప్పోకు చెందిన కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించి ప్రముఖ డేటా ఇంజనీర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన యోగేష్ బ్రార్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారతదేశంలో విడుదల కానున్నట్లు తెలిపారు. 2022 నుంచి బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలని వన్‌ప్లస్ భావిస్తోందని పేర్కొన్నారు. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన నార్డ్ సిరీస్ ప్రాముఖ్యం పొందడంతో అన్ని ఫోన్లను రూ.20000 కంటే తక్కువ ధరకే తీసుకురావాలనే యోచనలో కంపెనీ ఉన్నట్లు అంచనా వేశారు. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించాలని వన్‌ప్లస్ భావిస్తోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Oppo has always been linked to OnePlus one way or the other. But now they are dictating the terms. OnePlus is going through a shift, and sub 20k phones for India are on the cards.
— Yogesh Brar (@heyitsyogesh) September 8, 2021
No defined timeline for now, could see them as early as next quarter or Q2'22
Also Read: Jio phone next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్.. కొనాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే!
Also Read: Realme 8s: 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 8ఐ.. ప్రారంభ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్లు..