Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల ధరలు పెరిగాయి. నవంబర్ 26వ తేదీ నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల ధరను సవరించింది. ప్రస్తుతం కంపెనీ ఏఆర్‌పీయూ(ఒక వినియోగదారుడు పెట్టే సగటు ఖర్చు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉండాలని కంపెనీ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. తాము పెట్టిన పెట్టుబడి మీద రీజనబుల్ రిటర్న్ రావాలంటే ఆ మాత్రం ఉండాలని కంపెనీ అంటోంది.
అవసరమైన నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రంలు కొనడానికి ఈ మాత్రం ఏఆర్‌పీయూ ఉండాలని ఎయిర్ టెల్ అభిప్రాయం. దీంతో ఎయిర్‌టెల్ 5జీని మనదేశంలో ప్రారంభించడం కూడా సులభం అవుతుంది. దీనికి సాయపడేలా.. కంపెనీ తన టారిఫ్‌లను సవరించింది. ఇప్పుడు కొత్తగా సవరించిన టారిఫ్‌లు నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ప్లాన్లను కింద టేబుల్‌లో చూడవచ్చు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు
అన్నిటికంటే చవకైన రూ.79 ప్లాన్‌ను రూ.99కు పెంచారు. అలాగే అన్నిటికంటే ఖరీదైన రూ.2,498 ప్లాన్ రూ.2,999కు పెరిగింది. ఈ ప్లాన్ ధర ఏకంగా రూ.501 పెరిగింది. అయితే ధరలు పెరిగినప్పటికీ.. ఈ ప్లాన్ల ద్వారా లభించే లాభాల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
5జీ నెట్‌వర్క్‌లను మెరుగు పరచడం కోసం భారతీ ఎయిర్‌టెల్, అసెంచర్‌తో చేతులు కలిపింది. ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎయిల్‌టెల్ అడ్వాన్స్‌డ్ 5జీ ల్యాబ్ కూడా గుర్గావ్‌లో ఏర్పాటు అయింది. అసెంచర్ అక్కడ కొన్ని ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది. తయారీ మరింత కచ్చితంగా ఉండటానికి రోబోటిక్ చేతులను ఉపయోగించడం, ఇండస్ట్రియల్ ఐవోటీ ద్వారా ఉద్యోగులకు భద్రత కల్పించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వీడియో అనలిటిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, రిమోట్ మెయింటెయిన్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ ఫర్ బిజినెస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైస్పీడ్, లో లేటెన్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించి వ్యాపార అవసరాలను తీర్చేలా దీన్ని ఉపయోగించారు. దీనికోసం ఏడబ్ల్యూఎస్, సిస్కో, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, నోకియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకోనుంది.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!