By: ABP Desam | Updated at : 30 Nov 2022 06:49 PM (IST)
Edited By: nagavarapu
జాతీయ క్రీడా అవార్డులు 2022
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. భారత టేబుల్ టెన్నిస్ వెటరన్ ఆటగాడు శరత్ కమల్ కు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అతను 3 బంగారు పతకాలు, ఒక రజతం సాధించాడు.
ఈ అవార్డు వస్తుందని నేను ముందే ఊహించాను. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది నాకొక్కడికే రావడం. ఇందుకు ఎంపికైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. అని 40 ఏళ్ల శరత్ అన్నారు.
అలాగే బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్, హైదరాబాదీ అమ్మాయి నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు దక్కింది. మరో తెలుగమ్మాయి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల అర్జున అవార్జుకు ఎంపికైంది. బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ ఇంకా కొందరు క్రీడాకారులు అవార్డులు దక్కించుకున్నారు. మొత్తం 25 మందికి అర్జున అవార్డు, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డ్, నలుగురికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, 3 సంస్థలకు ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అవార్డులు వచ్చాయి. విజేతలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు.
ప్రముఖ క్రీడా ప్రముఖులు, క్రీడా పాత్రికేయులు మరియు క్రీడా నిర్వాహకులతో కూడిన ఎంపిక కమిటీ ప్రతి సంవత్సరం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు జాతీయ అవార్డుల కోసం నామినేషన్లను సిఫార్సు చేస్తుంది.
అర్జున అవార్డు గ్రహీతలు
సీమా పునియా డిస్కస్ త్రో
ఎల్డ్ హోస్ పాల్ త్రిపుల్ జంప్
అవినాష్ సబ్లే స్టీపుల్ ఛేజ్
లక్ష్య సేన్ బ్యాడ్మింటన్
హెచ్.ఎస్. ప్రణయ్ బ్యాడ్మింటన్
అమిత్ పంగాల్ బాక్సింగ్
నిఖత్ జరీన్ బాక్సింగ్
భక్తి కులకర్ణి చెస్
ఆర్. ప్రజ్ఞానంద చెస్
దీప్ గ్రేస్ ఎక్కా హాకీ
సుశీలా దేవి జూడో
సాక్షి కుమారి కబడ్డీ
నయన్ మోని సైకియా లాన్ బౌల్
సాగర్ ఓహాల్కర్ మల్లక్ హాంబ్
ఎలవేనిల్ వలరివన్ షూటింగ్
ఓం ప్రకాష్ మిధర్వాల్ షూటింగ్
శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్
వికాస్ ఠాకూర్ వెయిట్ లిఫ్టింగ్
అనూష రెజ్లింగ్
సరిత రెజ్లింగ్
పర్విన్ వుషు
మానసి జోషి పారా బ్యాడ్మింటన్
తరుణ్ థిల్లాన్ పారా బ్యాడ్మింటన్
స్వప్నిల్ పాటిల్ పారా బ్యాడ్మింటన్
జెర్లిన్ అనికా డెఫ్ బ్యాడ్మింటన్
ద్రోణాచార్య అవార్డ్ (రెగ్యులర్)
జీవన్ జ్యోత్ సింగ్ తేజా ఆర్చరీ
మహ్మద్ అలీ ఖమర్ బాక్సింగ్
సుమ సిద్దార్ధ్ షిరూర్ పారా షూటింగ్
సుజీత్ మాన్ రెజ్లింగ్
ద్రోణాచార్య అవార్డ్ (లైఫ్ టైమ్)
దినేశ్ జవహర్ లాడ్ క్రికెట్
బిమాల్ ప్రఫుల్లా ఘోష్ ఫుట్ బాల్
రాజ్ సింగ్ రెజ్లింగ్
ధ్యాన్ చంద్ అవార్డ్ (లైఫ్ టైమ్)
అశ్వని అకుంజీ. సీ అథ్లెటిక్స్
ధరమ్ వీర్ సింగ్ హాకీ
బీసీ. సురేష్ కబడ్డీ
నిర్ బహదూర్ గురుంగ్ పారా అథ్లెటిక్స్
Ganguly vs Virat Kohli: కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన దాదా
Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
IND vs AUS: టీమిండియా క్రికెట్ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?
PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!
BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>