అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!

Telangana Latest News: తెలంగాణ స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. లేకుంటే ఆయనపై అవిశ్వాస తీర్మామనం పెడతామని హెచ్చరిస్తోంది.

Telangana Assembly Sessions: తెలంగాణలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని సూచిస్తోంది. లేకుంటే అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. 

ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. మొదట కాంగ్రెస్‌ నేతలు మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ చర్చలో మాట్లాడిన జగదీష్‌ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. 

జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సభ మీది కాదని అందరిదీ అని అన్నారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని అనడంతో దుమారం రేగింది.  

జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ మరోసారి మండిపడింది. స్పీకర్‌ను ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. దళితులంటే గౌరవం లేదని అందుకే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో కూర్చొందని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సహా   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. స్పీకర్ను దూషించేలా జగదీష్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని మండిపడ్డారు.  
ఇంతలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నేతల తీరును తప్పుపట్టారు. జగనదీష్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని నిలదీశారు. సభలో అందరికీ సమానం హక్కులు ఉన్నాయని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. 

దీంతో కాంగ్రెస్ సభ్యులు మరింతగా ఫైర్ అయ్యారు. మొదటి నుంచి దళితులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపే అన్నారు. ఉద్యమం సమయంలో దళితుడే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అప్పటి నుంచి అడుగడుగునా దళితులను తొక్కే ప్రయత్నం చేశరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ సభ్యుల కామెంట్స్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నేతలు, వాళ్లకు వ్యతిరేకంగా అధికార పార్టీ లీడర్లు నినాదాలు చేసుకున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. 
వాయిదా తర్వాత మీడియా పాయింట్ వద్ద కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హరీష్‌రావు అవిశ్వాస తీర్మానం విషయం తెరపైకి తీసుకొచ్చారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించకపోతే కచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. 

సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు...స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదని మరోసారి స్పష్టం చేశారు. సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అన్నారని గుర్తు చేశారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని తెలిపారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కానేకాదన్నారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదని ఎద్దేవా చేశారు. సభను ఎందుకు వాయిదా వేశారో కూడా అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై స్పీకర్‌ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరామన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డు అడిగామని తెలిపారు. ఆ వీడియోలు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
Raja Singh: పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
Nara Lokesh : కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? ‌మీరు మారిపోయారు సార్!
Raja Singh: పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
Nara Lokesh : కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
SSMB29: మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం బిగ్ అప్‌డేట్... షూటింగ్ లొకేషన్ లీక్
మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం బిగ్ అప్‌డేట్... షూటింగ్ లొకేషన్ లీక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో బాలుడిని బలి తీసుకున్న లిఫ్ట్‌- ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
హైదరాబాద్‌లో మరో బాలుడిని బలి తీసుకున్న లిఫ్ట్‌- ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
Rajasthan Royals Coach Rahul Dravid : ఊత కర్రలతో రాహుల్ ద్రవిడ్‌ ఎంట్రీ- కళ్లు చెమ్మగిల్లే వీడియో పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్
ఊత కర్రలతో రాహుల్ ద్రవిడ్‌ ఎంట్రీ- కళ్లు చెమ్మగిల్లే వీడియో పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్
Posani Krishna Murali Latest News:
"లైడిటెక్టర్ పరీక్ష చేయండి, తప్పు చేస్తే నరికేయండి" న్యాయమూర్తి ముందు పోసాని గగ్గోలు
Embed widget