అన్వేషించండి

Driver Jamuna OTT Streaming: మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ - ఈ 'డ్రైవర్ జమున' స్టోరీ ఎందులో చూడొచ్చో తెలుసా?

Driver Jamuna OTT Platform: ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'డ్రైవర్ జమున'. ఇప్పటికే ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 'అమెజాన్ ప్రైమ్'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Aishwarya Rajesh's Driver Jamuna Movie OTT Streaming On Amazon Prime: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో అలాంటి కంటెంట్‌నే ఓటీటీలు ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) లీడ్ రోల్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'డ్రైవర్ జమున' (Driver Jamuna). ఈ మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే తమిళం, తెలుగులో 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుండగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్..

'డ్రైవర్ జమున' మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ (Amazon Prime Video) అందుబాటులోకి వచ్చింది. అయితే, కేవలం తమిళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కిన్ స్లిన్ దర్శకత్వం వహించగా.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్‌తో పాటు నరేన్ కీలక పాత్ర పోషించారు. జమున అనే యువతి తండ్రి హత్యకు గురి కాగా.. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో తన తండ్రి క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది.

Also Read: 'కోర్ట్' హిట్.. నా సినిమా సేఫ్ - 'హిట్ 3' డైరెక్టర్ శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్, మిర్చిలో ప్రభాస్ ఇమేజ్‌తో హైప్ ఇచ్చేశారుగా..

అయితే, తన తండ్రిని చంపిన ముగ్గురు ఓ రోజు ఆమె క్యాబ్ ఎక్కుతారు. ప్రజల్లో మంచి పేరున్న ఓ మాజీ ఎమ్మెల్యేను చంపేందుకు వీరు ప్లాన్ చేస్తుండగా.. వీరిని పోలీసులకు పట్టించబోయి ఆమెనే వారికి దొరికిపోతుంది. దీంతో ఆమె వారి నుంచి ఎలా బయటపడింది.?, అసలు ఆ కిల్లర్స్ జమున తండ్రిని ఎందుకు చంపారు.?, మాజీ ఎమ్మెల్యేకు, ఆమె తండ్రికి ఉన్న సంబంధం ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. 

ఇదే ఓటీటీలో మరో సిరీస్

మరోవైపు, ఇదే 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో నటించిన మరో వెబ్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'సుళుల్ సీజన్ 2' సైతం గత నెల 28 నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో ఆర్.పార్తీబన్ (R.Parthiban), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), శ్రియా రెడ్డి, కథిర్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1కు బ్రహ్మ జి అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. 

సాంబలూరు అనే ఊరిలోని సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు, యాజమాన్యానికి గొడవ జరుగుతుంది. ఆ కార్మికులకు షణ్ముగం (ఆర్.పార్తీబన్) లీడర్‌. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను అణచివేయాలని సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ప్రయత్నిస్తుంది. దీంతో కార్మికులు సమ్మె చేస్తారు. అదే రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగ్గా.. త్రిలోక్, సీఐ రెజీనా షణ్ముగం మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. షణ్ముగాన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అతని చిన్న కుమార్తె అదృశ్యం కావడంతో ఈ 2 కేసులను పోలీసులు విచారిస్తారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఊరిలో ఆంకాళమ్మ జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న టైంలో ప్రేమికుల హత్య, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్, 15 ఏళ్ల క్రితం జాతరలో మరో అమ్మాయి అదృశ్యం కావడం, వీటికి వాటికీ ఉన్న లింకేంటి.? నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్)కి తెలిసిన అసలు నిజం ఏమిటి? అనేది 'సుళుల్' వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. తన చెల్లిని చంపిన వారిని చంపి నందిని జైలుకెళ్లగా.. దానికి కొనసాగింపుగా సీజన్ 2 ఉంటుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget