FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ఫ్రాన్స్ - పోలండ్‌పై 3-1తో విజయం!
ఫిఫా ప్రపంచకప్‌లో పోలండ్‌పై 3-1తో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఫిఫా ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం పోలండ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1తో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి గోల్ సాధించిన ఒలివియర్ గిరౌడ్... ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
44వ నిమిషంలో గిరౌండ్ సాధించిన మొదటి గోల్ ఆట మొదటి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 75వ నిమిషంలో కిలియన్ ఎంబాపే రెండో గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఎంబాపేకు ఇది నాలుగో గోల్. లియోనెల్ మెస్సీ, కోడీ గాక్పో, మార్కస్ రాష్‌ఫోర్డ్, అల్వరో మోర్టాలను వెనక్కి నెట్టి ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వీరందరూ మూడు గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.
అయితే ఎంబాపే రికార్డులు అంతటితో ఆగలేదు. 90వ నిమిషంలో అతను మరో గోల్ సాధించాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో అతను ఐదో గోల్ సాధించాడు. 24 సంవత్సరాల్లోపే ఫిఫా ప్రపంచకప్‌ల్లో తొమ్మిది గోల్స్ సాధించిన మొదటి ఆటగాడిగా కిలియన్ ఎంబాపే నిలిచాడు. స్టాపేజ్ టైంలో పోలండ్ తరఫున రాబర్ట్ లెవాండోస్కీ గోల్ సాధించినా ఫ్రాన్స్ ఆధిక్యాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.
ఇప్పటికే అర్జెంటీనా, నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. అర్జెంటీనా తన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ కూడా తన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో 3-1 తేడాతో యూఎస్‌ఏపై గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన జరగనుంది.
View this post on Instagram
View this post on Instagram