ICC World Cup 2023 Final Match Live Score: మరోసారి అభిమానులకు గుండెకోత - ఫైనల్లో టీమిండియాపై ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా విజయం!
Australia vs India Final Match In World Cup 2023 Live Score: ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE
Background
IND vs AUS Final 2023 LIVE Score Updates Cricket World Cup 2023 India vs Australia Scorecard Match Highlights CWC 2023 Winner Narendra Modi Stadium
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ (World Cup 2023)లో భాగంగా ఆదివారం బిగ్ డే. గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా టైటిల్ కోసం ఆస్ట్రేలియా (Australia) తో టీమిండియా (Team India) తలపడనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియన్లను ఓడించాలనే కసితో ఉంది. 2003 పరాజయానికి బదులు చెప్పాలన్న సంకల్పంతో ఉంది. ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.
ఈ తుది పోరుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. చాలా మంది వీవీఐపీలు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ మ్యాచ్‌ను చూడటానికి వస్తున్నారు. ఆయనతోపాటు దేశంలోని వివిధ రంగాల్లోని సెలబ్రెటీలందరూ మ్యాచ్‌ను చూడబోతున్నారు.
2003 ప్రపంచకప్‌లో ఏం జరిగింది?
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సూపర్‌గా ఆడింది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన గంగూలీ జట్టు.. సూపర్ సిక్స్‌లో అన్నీ విజయాలతో ఫైనల్స్‌కు చేరింది. అయితే ఫైనల్లో కంగారూల ఊచకోత ముందు ఎదురు నిలువలేకపోయిన భారత్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌తో కూడిన భారత జట్టు లీగ్ దశలో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై బ్రెట్‌లీ, జాసెన్ గెలెస్పీ నిప్పులు చెరుగుతుండటంతో.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ మ్యాచ్‌లో సచిన్‌తో పాటు గంగూలీ ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. దాదా 9 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత సెహ్వాగ్ 4, రాహుల్ ద్రవిడ్ 1, యువరాజ్ సింగ్ 0, మహమ్మద్ కైష్ 1 ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సచిన్ టెండూల్కర్ (59 బంతుల్లో 36) సంయమనం పాటిస్తూ కాస్త ఆకట్టుకున్నాడు. అయితే గెలెస్పీ ఓ చక్కటి బంతితో సచిన్‌ను వెనక్కి పంపించాడు. దీంతో భారత్ ఓటమి పాలైైంది. ఆ మ్యాచ్‌లో సచిన్ తర్వాత అత్యధిక స్కోరు చేసింది హర్భజన్ సింగ్ (28). ఆసీస్ బౌలర్లలో బ్రెట్‌లీ, గెలెస్పీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం టీమ్‌ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత 2007 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్ దశ దాటలేకపోగా.. 2011 క్వార్టర్ ఫైనల్లో ఆసీస్‌పై ధోనీ సేన విజయం సాధించింది. 2015 సెమీఫైనల్లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌వ విజయం సాధించడంతో పాటు ఫైనల్లోనూ నెగ్గి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2019 నాకౌట్‌లో భారత్, ఆసీస్ ఎదురు పడకపోగా.. ఇప్పుడు ఫైనల్లో తలపడుతున్నాయి.
ఈసారి భారత జట్టు లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లతో పాటు.. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయాలతో ఫుల్ జోష్‌లో ఉంటే.. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అనంతరం వరుసగా ఎనిమిదింట నెగ్గిన ఆసీస్ తుదిపోరుకు చేరింది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నా.. గత కొన్ని మ్యాచ్‌ల్లో కంగారూలు కనబర్చిన పోరాటం.. భారత మేనేజ్‌మెంట్‌ను పరిగెత్తిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో మ్యాక్స్‌వెల్ ఒంటరి పోరాటంతో జట్టును గట్టెక్కించగా.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఓటమి తప్పదేమో అనుకుంటున్న సమయంలో లోయర్ మిడిలార్డర్ గొప్ప సంయమనం కనబర్చింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో కంగారూలను ఓడించడం మామూలు విషయం కాదని ఇప్పటికే పలుమార్లు నిరూపితం కాగా.. సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహం మధ్య బరిలోకి దిగనుండటం రోహిత్ సేనకు కలిసి రానుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఫైనల్లో ఆసీస్ నెగ్గగా.. మరి ఈ సారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!
మరోసారి అభిమానులకు గుండెకోత - ఫైనల్లో టీమిండియాపై ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా విజయం!
2023 ప్రపంచ కప్‌లో ఫైనల్స్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా కీలక సమయంలో చేతులెత్తేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లతో భారత్‌పై విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (137: 120 బంతుల్లో, 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
42 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 231-3
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 42 ఓవర్లు ముగిసేసరికి 231-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.
ట్రావిస్ హెడ్: 130(116)
మార్నస్ లబుషేన్: 57(109)
జస్‌ప్రీత్ బుమ్రా: 9-2-43-2
41 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 230-3
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 41 ఓవర్లు ముగిసేసరికి 230-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.
ట్రావిస్ హెడ్: 129(115)
మార్నస్ లబుషేన్: 57(104)
మహ్మద్ సిరాజ్: 6-0-35-0
40 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 225-3
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 40 ఓవర్లు ముగిసేసరికి 225-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.
ట్రావిస్ హెడ్: 128(114)
మార్నస్ లబుషేన్: 53(99)
జస్‌ప్రీత్ బుమ్రా: 8-2-42-2
39 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 219-3
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 39 ఓవర్లు ముగిసేసరికి 219-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.
ట్రావిస్ హెడ్: 127(113)
మార్నస్ లబుషేన్: 48(94)
మహ్మద్ సిరాజ్: 5-0-30-0