Varanasi Holi 2023: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ
ఆనందోత్సాహాలను రంగుల రూపంలో తీసుకొచ్చో హోలీని దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో, ఒక్కో పద్ధతిలో జరుపుకుంటారు. కాశీలో మాత్రం ఐదు రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది...అక్కడ ప్రత్యేకత ఏంటంటే
![Varanasi Holi 2023: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ Varanasi Holi 2023: devotes holi celebrations at manikarnika ghat in varanasi, history and significance, know in telugu Varanasi Holi 2023: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/21/aaba68863e0ea1336c58848900d0f3631676965768081217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Varanasi Holi 2023: ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటారు హోలీ. దీనినే హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు. దేశ వ్యాప్తంగా ఒక్కరోజు జరిగే ఈ వేడుక..కాశీలో మాత్రం ఐదురోజుల ముందుగానే ఏకాదశి రోజు మొదలవుతుంది.అయితే హోలీ వేడుకలు అంటే ఎక్కడైనా రంగులు, రంగు నీళ్లతో జరుపుకుంటే కాశీలో మాత్రం చితా భస్మంతో జరుపుకుంటారు. ఈ వినూత్న వేడుక చూసేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశీయులు సైతం బారులుతీరుతారు. దీనినే శ్మశాన హోలీ అంటారు. ఇలా జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంటలు 24 గంటలు మండుతూనే ఉంటాయి. ఈ ఘాట్ లో ఏకాదశి రోజు చితాభస్మాన్ని చల్లుకోవడంతో హోలీ వేడుకలకు మొదలవుతాయి. ఈ సమయంలో నాగ సాధువులు పాన్, బంగ్ అనే మత్తుని కలిగించే పదార్థం తీసుకుంటారు. దీనినే పరమేశ్వరుడి మహాప్రసాదంగా భావిస్తారు. వేడుకకు ముందు చితికి మంగళహారతి ఇచ్చి ఢమరుకం మోగించి పంచాక్షరి మంత్రాన్ని దిక్కులు పిక్కటిల్లేలా జపిస్తారు. కేవలం మణికర్ణికా ఘాట్ లో మాత్రమే కాదు ఆ బూడిదను కాశీ విశ్వనాథుడి దేవాలయంలోకి తీసుకెళతారు.
Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు
పార్వతిని తీసుకుని కాశీలో విశ్వనాథుడు అడుగుపెట్టిన రోజు
పురాణ కథనం ప్రకారం విశ్వనాథుడు అమ్మవారిని తీసుకుని కాశీనగరంలో అడుగుపెట్టిన సందర్భంగా రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారని చెబుతారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలపై రంగులు చల్లుతూ ఊరేగిస్తారు. ఈ సంప్రదాయ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రాతినిథ్యం వహిస్తారు.
ఆత్మతో మొదట శివుడు మాట్లాడే మాట ఇదే
కాశీలో మణి కర్ణికా ఘాట్ ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. శివుని సమక్షంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మరో కథనం ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దేశదిమ్మరి అయిన తన భక్త కనీసం దానిని వెతుకుతూ అయినా అక్కడే ఉంటాడన్నది అమ్మవారి ఆలోచన. అందుకే శివయ్య..ఈ ఘాట్ లో దహనమైన శరీరం తాలూక ఆత్మను స్వయంగా శివుడు అడుగుతాడు.. మణికర్ణిక కనిపించిందా అని.
విశ్వ నాధాష్టకమ్
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)