అన్వేషించండి

Nagula Chavithi Wishes in Telugu 2024: ఈ స్తోత్రాలతో నాగులచవితి శుభాకాంక్షలు తెలియజేయండి!

Nagula Chaviti Stotram: నాగులచవితి రోజు పుట్టలో పాలుపోసేందుకు వెళ్లేముందు ఇంట్లో పూజ చేస్తారు. ఆ సమయంలోను, పుట్ట దగ్గర ఈ స్తోత్రాలు చదువుకుంటే మంచి జరుగుతుందంటారు పండితులు.

Nagula Chavithi Wishes: నాగులచవితికి పుట్టలో పాలుపోసేందుకు వెళ్లేముందు...ముందుగా ఇంట్లో దేవుడికి పూజచేస్తారు. పుట్ట దగ్గరకు తీసుకెళ్లేందుకు చేసిన ప్రసాదంలో కొంత భాగాన్ని విడిగా తీసి ఇంట్లో దేవుడికి నివేదిస్తారు. కొందరు ఈ సమయంలోనూ షోడసోపచార పూజ చేస్తారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా షోడసోపచారపూజ చేయకపోయినా  నవనాగ  స్త్రోత్రం, సర్ప సూక్తం చదువుకుంటే మంచిదంటారు పండితులు. పుట్టదగ్గర రష్ కారణంగా అక్కడ చదువుకోలేం అనుకుంటే..ఇంట్లో చదువుకుని అయినా వెళ్లొచ్చు.  

Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!

నవనాగ నామ స్తోత్రం
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

ఫలశృతి:
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

సర్ప ప్రార్థన
బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

విష్ణు లోకే చ యేసర్పః వాసుకి ప్రముకాస్చయే:
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

రుద్రలోకే చ యేసర్పః తక్షక ప్రముఖాస్థధా |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

ఖాండవస్య తథాదాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

సర్పసత్రేయే సర్పాః ఆస్తికేన చరక్షితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

ప్రళయే చైవ యే సర్పః కర్కోట ప్రముఖాశ్యయే |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

ధర్మలోకేచయే సర్పాః వైతరన్యాం సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

యేసర్పః పార్వతాయేషు దరీసంధిషు సంస్థతాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

గ్రామేవాయది వారన్యే సర్పః ప్రచరంతిహి
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

పృథివ్యాం చైవ యేసర్పాయే సర్ప బిలసంస్తితా
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

రసాతలే చయే సర్పా అనంతాధ్యామహాబలాః
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

Also Read:  కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!

ఇతి శ్రీ సర్ప ప్రార్థన సంపూర్ణం ||

సర్ప సూక్తం 
నమో అస్తు సర్వేభ్యోయే కేచ పృథివీమను |
మీ అత్తరిక్షే యే దివి తేభ్యః సర్వేభ్యో నమః ॥ 1 ॥

(ఈ పృథివిపై, అంతరిక్షంలో, స్వర్గంలో ఉన్న సర్పాలన్నింటికీ నమస్కారం)

యేధో రోచనే దివో యేవా సూర్యస్య రష్మిషు |
యేషామప్సు సదః కృతం తేభ్యః సర్వేభ్యో నమః ॥ 2 ॥

(అధోలోకాల్లో , స్వర్గంలో, సూర్య కిరణాల్లో , నీటిలో నివాసం కల్పించుకుని ఉన్న సర్పాలకు నమస్కారం)

యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను |
యే వావటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః ॥ 3 ॥

(అసురులతో అస్త్రాలుగా ప్రయోగింపనివి, వృక్ష సమూహాలలో నివసించేవి, బావుల్లో నిద్రించే సర్పాలకు నమస్కారాలు)

ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ |
ఆశ్రేషా యేషామను యన్తి చేతః ।
యే అంతరిక్షం పృధివీం క్షియన్తి |
తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః |
యే రోచనే సూర్యస్వాపి సర్పాః |
యేదివం దేవీమనుసన్చరన్తి |
యేషామాశ్రేషా అనుయన్తి కామమ్ | 
తేభ్యస్వర్పేభ్యో మధుమజ్జుహోమి ॥ 4 ॥

(ఈ సర్పాలన్నింటికీ హవిస్సు అందుగాక. మానవాళికి మంచి బుద్ధిని ప్రసాదించి రక్షించుగాక)

నిఘృష్వెరసమాయుతైః |
కాలైర్హరిత్వమాపన్నైః |
ఇంద్రాయాహి సహస్రయుక్ |
అగ్నిర్విభ్రాష్టివసనః |
వాయుశ్వేతసికద్రుకః |
సంవత్సరోవిఘావర్ణైః|
నిత్యా స్తే నుచరాస్తవ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ॥ 5 ॥

(ఓ సహస్ర నేత్రాలు కల ఇంద్రా!కాలానికి అధీనులైన దేవతలతో, ప్రకాశవంతమైన వస్త్రములను ధరించిన అగ్ని దేవునితోనూ, తెల్లటి వాయువుతోనూ, సంవత్సర దేవునితోనూ నిరంతరం సన్నిహితుగా మెలిగే దేవతలతో కూడి నాకు ప్రత్యక్షమై నన్ను అనుగ్రహింతువు గాక. ఓం ఓం ఓం సుబ్రహ్మణ్యోగ్ం…

ఇతి శ్రీ సర్ప సూక్తం ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget