News
News
X

Sri Subhakrit Nama Samvatsaram: ఈ రాశివారికి అష్టమశని ఉన్నప్పటికీ ఈ ఉగాది నుంచి అంతా అనుకూలంగానే ఉంది

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 

శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో మిథున రాశి  ఫలితాలు

మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2

శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మిథున రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవానికి కారకుడైన గురుడు 10 వ స్థానంలో ఉన్నాడు. రాహువు 11 స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో ఉన్నప్పటికీ..అంటే అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు. పెద్దహోదాగల వ్యక్తులకో పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అధికారం వహించే శక్తిసామర్థ్యాలు వీరిసొంత. ఇంకా ఈ ఏడాది వీరికి ఎలా ఉందంటే... 

 • ఆదాయ మార్గాలు పెరుగుతాయి, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి
 • పాత ఇంట్లో మార్పులు ...లేదా.. నూతన స్థలం కొని స్థిరాస్తిని వృద్ధి చేయడం జరుగుతుంది
 • కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు
 • గడిచిన ఏడాదిలో పడిన బాధలు, ఇబ్బందులు, గుప్త శత్రువులనుంచి ఈ ఏడాది ఉపశమనం లభిస్తుంది
 • 11వ స్థానంలో ఉన్న రాహువు కార్యసిద్ధినీ గౌరవాన్ని ప్రసాదిస్తాడు. జీవితాశయాలు నెరవేరుతాయి
 • గురు, శని, కేతు దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి కానీ తెలివిగా పనులు పూర్తిచేస్తారు
 • వివాదాలకు దూరంగా ఉండాలి, వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి
 • ఉద్యోగస్తులకు శాంతం అవసరం, విద్యార్థులు కష్టపడితేకానీ ఫలితాలు పొందలేరు, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది
 • వ్యాపారులకు ఈ ఏడాది శుభసమయం, ఉమ్మడివ్యాపారాలు బాగా సాగుతాయి
 • బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించండి.
 • అవివాహితులకు వివాహం జరుగుతుంది, దళారులు-వివాహ సంబంధం ఏజెన్సీలను విశ్వసించవద్దు
 • బంధువులతో తెగిపోయిన బంధాలు బలపడతాయి, సంతానం భవిష్యత్ పై శ్రద్ధ వహించండి
 • శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూల సమయం
 • నగదు, విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం తగదు, ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు
 • కుటుంబంలో పెద్దల గురించి ఆందోళన చెందుతారు
 • సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జఠిలమవుతాయి, న్యాయ నిపుణులతో సంప్రదించాల్సి వస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవటం క్షేమదాయకం.
 • వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది, పంటల దిగుబడి బాగుంటుంది.గిట్టుబాటు ధర విషయంలో సమస్యలెదురవుతాయి.
 • వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రవాణ, ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
 • ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
 • మీ ఆలోచనా విధానం, సంస్కారం వల్ల ఇంటా-బయటా గౌరవం లభిస్తుంది
 • అష్టమశనివలన అధైర్యంగా అనిపించినా అదిబయట పడకుండా దూసుకుపోయే లక్షణం ఉంటుంది  

ఒక్కమాటలో చెప్పాలంటే మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఎంతటివారినైనా ఆకర్షించగలరు, పట్టుదలతో పనులు సాధించుకుంటారు...

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప

Published at : 28 Mar 2022 12:24 PM (IST) Tags: subhakruth nama samvatsara 2022 sri shubhakruth nama samvatsara ugadi rasi phalalu sri shubhakruth nama samvatsara ugad panchangam 2022-2023 ugadi Horoscope 2022-2023 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces

సంబంధిత కథనాలు

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Horoscope Today 18 August 2022:  ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు