Sri Subhakrit Nama Samvatsaram: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం...
![Sri Subhakrit Nama Samvatsaram: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే Sri Subhakrit Nama Samvatsaram : 2022-2023 Astrology, Yearly horoscope, Aries Horoscope in telugu, Mesha Rasi Phalalu , Know In Details Sri Subhakrit Nama Samvatsaram: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/27/9afe348bc54a16f4a4cb7cc3242179d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మేషరాశి ఫలితాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6
మేషరాశివారికి ధనం-కుటుంబకారకుడైన గురుడు 12 వఇంట, రాజ్యాధిపతి అయిన శని దశమంలోనూ, రాహుకేతువులు జన్మం, సప్తమంలోనూ ఉన్నందున ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలుంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే మంచి-చెడు, జపం-అపజయం అన్నీ సమానంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలను మాత్రం సమర్థంగా నిర్వహిస్తారు.
- ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వచ్చినందంతా ఖర్చైపోతోందనే భావన ఉన్నప్పటికీ ఖర్చైన మొత్తంలో సగభాగం భవిష్యత్ అవసరాలకోసం పెట్టేలా ప్లాన్ చేసుకుంటారు.
- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఎప్పటినుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
- నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రం ఓసారి ఆలోచించడం మంచిది. స్థిర చరాస్తుల వ్యవహారాల్లోనూ ఆచితూచి అడుగేయాలి.
- బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
- పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
- వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. అయితే జాతకాలు సరిగా చూసుకోవడం మరవొద్దు
- ఉద్యోగస్తులకు ఈ ఏడాది కలిసొస్తుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి.
- వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి, హోల్ సేల్ వ్యాపారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి
- వైద్య రంగంలో ఉండేవారికి ఆదాయాభివృద్ధి.
- విద్యార్థులు అనవసర వ్యాపకాలు తగ్గించుకుంటే కానీ లక్ష్యాన్ని చేరుకోలేరు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి
- దైనచింతన పెరుగుతుంది, దైవసంబంధింత కార్యాలపై దృష్టి సారిస్తారు
- తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది
- కోర్డు సంబంధిత వ్యవహారాల్లో చిక్కుకున్నవారు పరిష్కారం దిశగా అడుగువేస్తారు
- స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగేయాలి
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
ఇంకా బంధువర్గంతో కొన్ని విభేదాలుంటాయి, అకారణంగా మాటలు పడాల్సిన సందర్భాలు ఎదరవుతాయి. మీకు రహస్య శత్రువులున్నారు జాగ్రత్త. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఇద్దరూ ఒకేమాటపై అడుగేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శించకుండా, ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకుంటూ వెళితే అనుకూల ఫలితాలుసాధించే అవకాశం ఉంది.
శుభకృత్ నామ సంవత్సరంలో మేషరాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయో మరో కథనంలో తెలుసుకోండి
Also Read: ఉగాది అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)