అన్వేషించండి

Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?

Delimitation Commission Assembly Seats: డీలిమిటేషన్ బిల్లుతో కేవలం ఎంపీ సీట్లే పెరుగుతాయా? ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు ఉన్న రాజ్యాంగ నిబంధనలు, చట్టపరమైన అవకాశాలు ఎంత ఉన్నాయి?

AP Reorganisation Act Section 26 Assembly Seats: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే డీలిమిటేషన్  చట్టం అమల్లోకి వస్తే కేవలం లోక్‌సభ స్థానాలే పెరుగుతాయా లేక రాష్ట్రాల శాసనసభ  సీట్లు కూడా పెరుగుతాయా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిళ్లలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. డీలిమిటేషన్ అనగానే చాలామంది కేవలం ఎంపీ సీట్ల పెంపు గురించే చర్చిస్తున్నప్పటికీ, రాజ్యాంగ నిబంధనలు , ప్రతిపాదిత 131వ రాజ్యాంగ సవరణల ప్రక్రియ ప్రకారం పార్లమెంట్ సీట్లతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. రాజ్యాంగంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రత్యేకమైన అధికరణలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.

రెండింటికీ వేర్వేరుగా లేదా ఒకే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సవరణలు

భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ స్థానాల విభజన ఆర్టికల్ 81, 82ల ప్రకారం జరిగితే.. రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన  ఆర్టికల్ 170  పరిధిలోకి వస్తుంది. డీలిమిటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, రాజ్యాంగంలోని ఈ రెండింటికీ వేర్వేరుగా లేదా ఒకే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 170 పై ఉన్న నిషేధాన్ని తొలగించకుండా కేవలం ఎంపీ సీట్లను పెంచడం సాధ్యపడదు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే లోక్‌సభతో పాటు ప్రతీ రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్యను కూడా దామాషా పద్ధతిలో పెంచడానికి చట్టపరమైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది.

విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచాల్సిందే! 

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టపరమైన కోణం కూడా ఉంది. 2014లో రూపొందించిన  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 26  ప్రకారం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల వరకూ సీట్ల పెంపుపై ఫ్రీజ్  ఉన్నందున, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆ నిబంధన అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఆర్టికల్ 170 సవరణ జరిగి నియోజకవర్గాల సరిహద్దుల ఫ్రీజ్ తొలగిపోతే.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు ఉన్న ఏకైక రాజ్యాంగ అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది.

సీట్లు ఖచ్చితంగా పెరిగాల్సిందే! 

మరి ఏపీ, తెలంగాణల్లో సీట్లు పెరుగుతాయనడానికి ఖచ్చితమైన గ్యారంటీ ఉందా అంటే.. సమాధానం  నూటికి నూరు శాతం గ్యారంటీ  అనే చెప్పాలి. ఎందుకంటే, కేంద్రం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక డీలిమిటేషన్ నమూనా  50 శాతం స్థానాల పెంపు ప్రాతిపదిక  ప్రకారం లేదా ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం చూసినా సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు 26కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు పెరిగినప్పుడు, దానికి అనుగుణంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల విస్తరణ   జరగడం తప్పనిసరి. ప్రస్తుతం ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి కనీసం  225 లేదా అంతకంటే ఎక్కువకి , తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153 లేదా 160కి  పైగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డీలిమిటేషన్ కమిషన్  ఏర్పాటు కావడం, అది ప్రకటన విడుదల చేయడం ద్వారా మాత్రమే కొత్త నియోజకవర్గాల సరిహద్దులు, ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు స్థానాల వర్గీకరణ ఖరారవుతాయి. 

ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదు! 

దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీలు మళ్లీ తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర పార్లమెంట్ ఆమోదించే డీలిమిటేషన్ చట్టమే రాష్ట్ర స్థానాల పెంపుకు నేరుగా వర్తిస్తుంది. ఈ సీట్ల పెంపు ప్రక్రియ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన రాజకీయ సంచలనాలకు, సమీకరణలకు దారితీయనుంది.  ప్రతి నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులకు, యువ నాయకులకు కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసే సువర్ణావకాశం లభిస్తుంది. అంతేకాకుండా, గ్రేటర్ హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లోనూ, అమరావతి పరిసర ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన మరిన్ని కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  డీలిమిటేషన్ పార్లమెంట్‌కే పరిమితం కాదు, అది రాష్ట్రాల శాసనసభలను కూడా సమాంతరంగా పునర్వ్యవస్థీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు చట్ట రూపం దాల్చిన మరుక్షణమే డీలిమిటేషన్ కమిషన్ రంగంలోకి దిగుతుంది. అందువల్ల ఏపీ ,  తెలంగాణ అసెంబ్లీలలో స్థానాలు పెరగడం అనేది కేవలం ఒక రాజకీయ అంచనా మాత్రమే కాదు, రాజ్యాంగపరంగా,  చట్టపరంగా జరగబోయే ఒక అనివార్యమైన పరిణామం!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
YSRCP AP Assembly : పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?
పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
Embed widget