అన్వేషించండి

Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!

Pawan vs Prakash Raj: లోక్‌సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య వార్‌కు కారణమైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదు.
  • పవన్ కల్యాణ్ విపక్షాలపై మహిళా ప్రాతినిధ్యం అడ్డుకున్నారని విమర్శించారు.
  • ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్‌పై మోదీని సంతోషపెట్టడానికి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
  • డీలిమిటేషన్ బిల్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాశ్ రాజ్ అన్నారు.

Pawan vs Prakash Raj: భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలకమైన డీలిమిటేషన్ దిశగా కేంద్రం ప్రభుత్వం వేసిన మరో అడుగు లోక్‌సభలో ఆగిపోయింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయింది. ఈ పరిణామం కేవలం పార్లమెంటు గోడల మధ్యే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా వార్ నడుస్తోంది. 

మహిళా రిజర్వేషన్లను ముందస్తుగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుకు మద్దతుగా 298 మంది ఎంపీలు ఓటు వేయగా 230 మంది వ్యతిరేకించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. దీంతోపాటు దీనికి అనుసంబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026లను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 

విపక్షాలపై పవన్ విమర్శలు

ఈ పరిణామంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ విపక్షాల తీరును తప్పుపట్టారు. భారత చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఒక చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్ధతు ఇచ్చే చిత్తశుద్ధి విపక్షాలకు లేదని ఆయన ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. 

చంద్రబాబుపై ప్రకాశ్‌ విమర్శలు

డీలిమిటేషన్‌పై చంద్రబాబు చెబుతున్న అబద్దాలు కచ్చితంగా దేశం గుర్తు పెట్టుకుంటుందని ప్రకాష్ రాజు కామెంట్ చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు స్పందన 

పవన్ కల్యాణ్ చేసిన పోస్టుపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. కేవలం ప్రధాని మోదీని సంతోష పెట్టడం కోసం ప్రజలను తప్పుదారి పట్టించవద్దని పవన్‌ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు  ఇప్పటికే 2023లో ఆమోదం పొందిందని దానిని అమలు చేసే అధికారం కేంద్రం వద్ద ఉందని గుర్తు చేశారు. 

కొత్త బిల్లు వెనుక అసలు కారణం డీలిమిటేషన్ అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ సహా  దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుందని, రాష్ట్ర హక్కులను, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకుట్టు పెట్టవద్దని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 

ప్రకాశ్ రాజ్‌కు భాను ప్రకాశ్ లీగల్ నోటీసులు 

ప్రకాశ్‌ రాజ్‌ ఈ మధ్య కాలంలో రామలక్ష్మణులపై  ఉద్దేశపూర్వకంగానే కామెంట్స్‌ చేశారని టీటీడీ  బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులకు స్పందించకపోతే లేదా బహిరంగ క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా వంద కోట్లకు పరువు నష్టం దావా  వేశారు.  

Frequently Asked Questions

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఎందుకు వీగిపోయింది?

131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లను ముందస్తుగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ ఏమన్నారు?

మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సంస్కరణలకు విపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రకాశ్ రాజ్ స్పందన ఏమిటి?

ప్రధాని మోడీని సంతోషపెట్టడానికి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ప్రకాశ్ రాజ్ పవన్‌కు సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023లో ఆమోదం పొందిందని, దాని అమలు కేంద్రం చేతిలోనే ఉందని గుర్తు చేశారు.

డీలిమిటేషన్ బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో, దానితో అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026లను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget