Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Lenin Box Office Collections : అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ రెండో వారంలోనూ కలెక్షన్స్ జోరు తగ్గలేదు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌పై మూవీ టీం అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Akhil Akkineni's Lenin Box Office Ten Days Collections : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ విలేజ్ యాక్షన్ డ్రామా లెనిన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న రిలీజైన మూవీ వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్స్‌తో అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో ఉండగా... 10 రోజుల కలెక్షన్స్‌పై మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
10 రోజుల కలెక్షన్స్
లెనిన్ ఇప్పటివరకూ అంటే పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. 'గడిచే ప్రతీ రోజూ సంతోషించడానికి మరో కారణం' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే అఖిల్ కెరీర్‌లో ఫస్ట్ రూ.100 కోట్ల మూవీగా రికార్డు క్రియేట్ చేయనుంది లెనిన్.
తొలి 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.67.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తే... ఇండియావ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే జోష్ కంటిన్యూ అవుతోంది.
Also Read : Anasuya Bharadwaj : అందానికే అ(న)సూయ - ఆరు గజాల చీరతో పాటు శతాబ్దాల ఆత్మవిశ్వాసం... దేవకన్యే దిగివచ్చిందా?
ఈ మూవీకి వినరో భాగ్యము విష్ణుకథ ఫేం మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా... అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరి రావు, శివాజీ, రంగస్థలం మహేశ్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్నారు.
Also Read : Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు























