అన్వేషించండి

Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!

Twin Murder Execution Order: భార్య వదిలేసి వెళ్లిపోయింది. పక్కింటి వాళ్ల వల్లే వదిలేసిపోయిందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. అంతే ఆ ఇంట్లో ఉన్న వారందర్నీ నరికేశాడు ఆ ఉన్మాది.

Nenmara Double Murder: కేరళలోని పాలక్కాడ్ జిల్లా  డబుల్ మర్డర్  కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతామరకు పాలక్కాడ్ అడిషనల్ సెషన్స్ కోర్టు మరణశిక్ష   ఖరారు చేసింది. ఈ దాడిని అరుదైన వాటిలో అత్యంత అరుదైనది గా అభివర్ణించిన న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్, నిందితుడికి రూ.20 లక్షల జరిమానా విధించడమే కాకుండా, అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. కేరళ క్రైమ్ సీరిస్‌లకు ఏ మాత్రం తీసిపోని నేరం ఇది.

ఒక జ్యోతిష్కుడి మాట.. రాజుకున్న పగ!  

ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు అసలు కారణం 2019కి ముందు జరిగింది.  చెంతామర  అనే వ్యక్తి కుటుంబంలో కలహాలు వచ్చి అతడి భార్య విడిపోవడానికి పొరుగునే ఉన్న సుధాకరన్ కుటుంబమే కారణమని ఒక స్థానిక జ్యోతిష్కుడు చెంతామరకు చెప్పాడు. ఆ క్షణం నుంచి సుధాకరన్ కుటుంబంపై చెంతామర మనస్సులో క్రూరమైన పగ రగిలిపోయింది. ఆగస్టు 2019లో, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, సుధాకరన్ భార్య సజితను ఇంట్లోకి చొరబడి వేటకత్తితో దారుణంగా నరికి చంపేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన చెంతామరకు కోర్టు రెట్టింపు జీవిత ఖైదు విధించింది.

 బెయిల్‌పై వచ్చి నరమేధం! 

సజిత హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూనే, బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని జనవరి 2025లో చెంతామర బయటకు వచ్చాడు. అయితే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి రాత్రికి రాత్రే మళ్లీ పోతుండిలోని తన పాత ఇంటికి చేరుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న చెంతామర, 2025 జనవరి 27న తెల్లవారుజామున సుధాకరన్ ఇంట్లోకి   పదునైన వేటకత్తితో చొరబడ్డాడు. అడ్డువచ్చిన సుధాకరన్  , అతడి వయోధికురాలైన తల్లి లక్ష్మి  లను విచక్షణారహితంగా నరికి అక్కడికక్కడే హత్య చేసి, సమీపంలోని మట్టాయి అడవుల్లోకి పరారయ్యాడు.

 నేనేం గాంధీని కాను.. మళ్లీ చంపుతా..కోర్టులోనే హెచ్చరిక
 
కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందర చెంతామర ప్రవర్తించిన తీరు అధికారులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. జడ్జి శిక్షపై అభిప్రాయం అడిగినప్పుడు..  నాకేం పశ్చాత్తాపం లేదు. ఒకరు చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించడానికి నేనేం మహాత్మా గాంధీని కాను! నాకు అడ్డొస్తే మళ్లీ చంపుతా, నన్ను ఉరితీసినా పర్లేదు  అంటూ బరితెగించి మాట్లాడాడు. మానసిక అనారోగ్యం నెపంతో డిఫెన్స్ లాయర్లు తప్పించుకునేందుకు చూసినప్పటికీ, అతనికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని సైకియాట్రిక్ మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వడంతో నిందితుడి నేర స్వభావం రుజువైంది.

 తీర్పుతో ఊపిరిపీల్చుకున్న బాధితుల కుటుంబం 

తల్లి, తండ్రి, నానమ్మలను వరుసగా కోల్పోయి అనాథలుగా మిగిలిన సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నిందితుడు బయట ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందేమోనన్న భయంతో ఇన్నాళ్లూ బతికామని, ఈ తీర్పుతో తమకు కొంత న్యాయం జరిగిందని కన్నీటిపర్యంతమయ్యారు. సైంటిఫిక్ ఆధారాలు, 81 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీస్ యంత్రాంగం వేగంగా విచారణ పూర్తిచేసి నేరస్థుడికి ఉరిశిక్ష పడేలా చేయడంపై కేరళ ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget